Breaking News

అప్పటి వరకు ఎంత తిట్టినా పడతా: విజయ్‌దేవరకొండ

Published on Wed, 04/03/2024 - 12:12

\విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. ‘గీతగోవిందం’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత పరశురామ్‌, విజయ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన రెండో చిత్రమిది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించారు. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రబృందం అంతా ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. విజయ్‌ దేవరకొండ, దిల్‌ రాజు అటు తమిళ్‌లోనూ ఇటు తెలుగులోనూ తెగ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల గ్రాండ్‌గా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘గీతగోవిందం’ నా కెరీర్‌లో సూపర్‌ హిట్‌ మూవీ. ఇప్పటివరకు ఈ సినిమాను బీట్‌ చేసే మూవీ చేయలేదు. కెరీర్‌ ఆరంభంలో నేను నటించిన చిత్రం రూ. 100 కోట్లు కలెక్ట్‌ చేస్తే బాగుండని ఎన్నోసార్లు అనుకున్నాను. నా నాలుగో సినిమా గీతగోవిందంతోనే అది నిజమైంది. ఇటీవల నేను నటించిన ఓ సినిమా రూ.200 కోట్లు కలెక్ట్‌ చేస్తుందని చెప్పా. కానీ అది జరగలేదు. ఆ సమయంలో చాలా మంది నన్ను కామెంట్‌ చేశారు.

అలాంటి స్టేట్‌మెంట్స్‌ ఎందుకు ఇస్తావని విమర్శించారు. నేను అలా స్టేట్‌మెంట్‌ ఇవ్వడం తప్పు కాదు. స్టేట్‌మెంట్స్‌ ఇచ్చి విజయం సాధించకపోవడం తప్పు. ఏదో ఒకరోజు ఆ స్థాయి కలెక్షన్స్‌ సాధిస్తా. అప్పటి వరకు మేరు ఎంత తిట్టినా పడతా. ఇప్పుడు కూడా నా మాటల్ని బలుపు అనుకుంటారు. కానీ.. నాపై నాకు ఉన్న నమ్మకం. అదే నమ్మకంతో చెప్తున్నా. ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటీ.. నేను స్టార్ అయితే మీరు అవ్వలేరా ఏంటీ.. వాళ్లు రూ.200 కోట్లు కొడితే మనం కొట్టలేమా? ఏంటీ.. నేను కొడితే మీలో ఒకరు కొట్టలేరా ఏంటీ.. ఇదో జర్నీ.. మన లైఫ్‌లో ఎన్నో చూడాల్సి వస్తుంది. ఎన్నో అవమానాలు.. కిందకి లాగేవాళ్లని చూస్తుంటారు. వీటన్నింటినీ దాటుకుంటూ వెళ్లడమే జీవితం’ అని విజయ్‌ అన్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)