ఆమెతో కిచుకిచులకు ప్రయత్నించా..వర్కౌట్‌ కాలేదు: విజయ్‌ ఆంటోని

Published on Sat, 03/16/2024 - 07:53

తమిళసినిమా: సంగీత దర్శకుడు, నటుడు విజయ్‌ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం రోమియో. మీరా విజయ్‌ ఆంటోని సమర్పణలో విజయ్‌ ఆంటోని ఫిలిం కార్పొరేషన్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ద్వారా వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటి మృణాళిని రవి నాయకిగా నటించిన ఇందులో యోగిబాబు, వీటీవీ.గణేశ్‌, తలైవాసల్‌ విజయ్‌, ఇళవరసు, సుధా, శీజా ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం రంజాన్‌ సందర్భంగా వచ్చే నెలలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. రోమియో చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చిత్ర యూనిట్‌ చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

ఇందులో చిత్ర దర్శకుడు వినాయక్‌ వైద్యనాథన్‌ మాట్లాడుతూ ఒక స్త్రీ తన భర్తను ఎలా ప్రేమగా చూసుకోవాలి అన్నదే ఈ చిత్ర ప్రధానాంశం అని పేర్కొన్నారు. ఈ కథకు స్ఫూర్తి తన తల్లి అని అన్నారు. తాను ఒక షార్ట్‌ ఫిలిం చేసి అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో విజయ్‌ఆంటోని నుంచి ఫోన్‌కాల్‌ వచ్చిందన్నారు. తాను చేసిన షార్ట్‌ ఫిలిం గురించి ఎంతో డిటైల్‌గా వివరించి మంచి కథ ఉంటే చెప్పండి అని ఆయన అన్నారన్నారు. దీంతో ఆయన హీరోగా ఒక లవ్‌స్టోరీని చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అందుకు కథను రెడీ చేయడానికి ఏడాది గడువు అడిగినట్లు చెప్పారు. అలా మొదలైంది రోమియో చిత్రం అని చెప్పారు.

విజయ్‌ఆంటోని మాట్లాడుతూ మృణాళిని ఆత్మవిశ్వాసం కలిగిన మంచి అమ్మాయి అని పేర్కొన్నారు. రోమియో చిత్ర ప్రచారం కోసం తమ గురించి కిచుకిచులు చేయాలని ప్రయత్నించామని, అయితే అవేవి వర్కౌట్‌ కాలేదన్నారు. తాను తొలిసారిగా ఒక ప్రేమ కథా చిత్రంలో నటించినట్లు చెప్పారు. ఒక స్త్రీ మగవాడిని హింసిస్తుందీ, అతను దాన్ని ఎలా భరిస్తాడు? అన్న ఇతి వృత్తంతో రూపొందించిన చిత్రం రోమియో అని చెప్పారు. ఇది కచ్చితంగా అందరికీ నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Videos

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)