Breaking News

ఆ సీన్లు లేకుండా చేస్తారా.. నాకు మీరే న్యాయం చేయండి: విజయ్‌ ఆంటోని

Published on Thu, 07/20/2023 - 06:55

కోలివుడ్‌లో 'నాన్‌' అనే సీరియస్‌ కథా చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయిన సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోని. ఆ తరువాత పలు సక్సెస్‌పుల్‌ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఈయన పిచ్చైక్కారన్‌– 2 తెలుగులో (బిచ్చగాడు-2) చిత్రంతో దర్శకుడిగానూ పరిచయం అయ్యి విజయం సాధించారు. తాజాగా విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా నటించిన చిత్రం కొలై (హత్య). నటి రిత్వికా సింగ్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి బాలాజీ కె.కుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం తెరపైకి రానుంది.

(ఇదీ చదవండి: ఎవరూ నమ్మలేరు మన హీరోయిన్లు పాక్‌ సినిమాల్లో నటించారంటే)

ఈ సందర్భంగా  చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో చిత్ర ఫ్రీ రిలీజ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ కథ చెప్పినప్పుడు ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని దర్శకుడు చెప్పారన్నారు. ఆ తరువాత ఇద్దరని అన్నారనీ, వారిలో నటి మీనాక్షీ వేరే నటుడికి పెయిర్‌ కాగా, నటి రిత్వికా సింగ్‌ తనకు సోదరిగా నటించినట్లు చెప్పారు. ఇందులో తనకు ఒకే ఒక్క భార్య ఉన్నారనీ, ఆమె కూడా కళ్ల ముందే కాలిపోతుందని చెప్పారు. అలా ఈ చిత్రంలో తనకు రొమాన్స్‌ లేకుండా చేశారని, ఇందుకు తనకు న్యాయం కావాలి అని సరదాగా అన్నారు.

అయితే దర్శకుడు బాలాజీ కే.కుమార్‌ ఏడు ఏళ్ల తరువాత దర్శకత్వం వహంచిన చిత్రం ఇది అనీ, చాలా బాగా వచ్చిందని పేర్కొన్నారు. కాగా మళ్లీ సంగీత దర్శకుడిగా ఎప్పుడు పని చేస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ, ప్రస్తుతానికి కొంచెం గ్యాప్‌ ఇచ్చానని, తన కేరీర్‌ ముగిసేలోగా కనీసం 20 మంది కొత్త సంగీత దర్శకులను పరిచయం చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. అందుకే సంగీతదర్శకుడిగా కొంత కాలం తప్పుకుంటున్నట్లు చెప్పారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?