Breaking News

ఈ సినిమాలో ఆ సీన్స్ కూడా ఉంటాయి: బిచ్చగాడు హీరో

Published on Thu, 05/04/2023 - 09:37

సంగీతదర్శకుడు, నటుడు విజయ్‌ ఆంటోని ఇంతకు ముందు కథానాయకుడిగా నటించి నిర్మించిన పిచ్చైక్కారన్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'పిచ్చైక్కారన్‌– 2' (తెలుగులో బిచ్చగాడు-2) చిత్రాన్ని సొంతంగా నిర్మించి, సంగీతాన్ని అందించి, కథానాయకుడిగా నటించారు.

(ఇది చదవండి: ఆయన పరిస్థితిని చూస్తే భయమేసింది: మహేశ్)

ఇందులో విశేషమేమిటంటే ఈ చిత్రం ద్వారా ఆయన దర్శకుడిగా అవతారమెత్తడం. విజయ్‌ ఆంటోని ఫిలిం కార్పొరేషన్‌ పతాకంపై ఈయన సతీమణి ఫాతిమా విజయ్‌ ఆంటోని నిర్మించిన ఈ చిత్రంలో కావ్య తాపర్‌ నాయకిగా నటించగా రాధారవి, వైజీ.మహేంద్రన్‌, మన్సూర్‌ అలీఖాన్‌, హరీష్‌ పేరడీ, జాన్స్‌ విజయ్‌, దేవ్‌ గిల్‌, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి ఓమ్‌ నారాయణన్‌ ఛాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 19వ తేదీన తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఈ సందర్భంగా బుధవారం చిత్ర యూనిట్‌ స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ ఈ చిత్ర షూటింగ్‌ సమయంలో ప్రమాదానికి గురైన తాను ఇప్పుడు పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. సాధారణంగా యాక్షన్‌ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయనీ, తనకు మాత్రం పాటల చిత్రీకరణలో ప్రమాదం జరిగిందన్నారు.

తాను సంగీతదర్శకుడిగానూ ఎవరి వద్దా పని చేయలేదనీ, చిత్రాలు చూసిన అనుభవమేనన్నారు. చిత్రం చాలా బాగా వచ్చిందనీ, ఇంతకు ముందు చిత్రాల్లో తనకు రొమాన్స్‌ సన్నివేశాలు పెద్దగా లేవనేవారనీ.. ఈ చిత్రంలో అలాంటి సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయని చెప్పారు. ఇది అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు.

(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీని పెద్దలే తాకట్టు పెట్టారు: నట్టి కుమార్ సంచలన కామెంట్స్)

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?