Breaking News

నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేశ్‌ శివన్‌ బాబాయ్‌

Published on Sat, 07/08/2023 - 08:01

దర్శకుడు విగ్నేష్‌ శివన్‌, నయనతారలపై ఆస్తి అపహరణ కేసు నమోదు అయ్యింది. ఆరేళ్ల క్రితం ప్రేమలో పడి, సహజీవనం చేస్తూ గత రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న సంచలన జంట నయనతార, విఘ్నేష్‌ శివన్‌. సౌత్‌ ఇండియా చిత్ర పరిశ్రమలో నయనతార నటిగా రానిస్తూ.. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉన్నా వ్యక్తిగతంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ జంట సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయిన విషయం కూడా వివాదంగా మారింది.

(ఇదీ చదవండి; 'దేవర' తర్వాత జాన్వీని తమిళ్‌కు పరిచయం చేయనున్న టాప్‌ హీరో)

తాజాగా వీళ్లకు మరో సమస్య ఎదురైంది. విఘ్నేశ్‌ శివన్‌ పూర్వీకం తిరుచ్చి జిల్లా, లాల్‌కుడి గ్రామం ఈయన తండ్రి పేరు శివకొళుదు. వీళ్లు తొమ్మిది మంది అన్నదమ్ములు. పోలీస్‌ ఇన్ఫార్మర్‌గా పనిచేసిన విఘ్నేష్‌ శివన్‌ తండ్రి శివకొళుదు ఇప్పుడు లేరు. అయితే ఈయన జీవించి ఉండగా తమ ఉమ్మడి ఆస్తిని అన్నదమ్ములకు తెలియకుండా మోసపూరితంగా అపహరించినట్లు ఆయన సోదరుడు మాణిక్యం కోయంబత్తూర్‌లో నివసిస్తున్న మరో సోదరుడు కుంచిత పాదం గురువారం తిరిచ్చి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

(ఇదీ చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్‌ వస్తుంది: మాళవిక)

అందులో మాణిక్యం పేర్కొంటూ తమ సోదరుడు విఘ్నేష్‌ శివన్‌ తండ్రి ఉమ్మడి ఆస్తిని తమకు తెలియకుండా వేరే వారికి విక్రయించి మోసానికి పాల్పడ్డాడని, తమ ఆస్తిని కొనుగోలు చేసిన వారికి డబ్బును తిరిగి ఇచ్చి, ఆస్తిని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా తమ సోదరుడు కుమారుడు విఘ్నేశ్‌ శివన్‌ అతని తల్లి మీనాకుమారి, సోదరి ఐశ్వర్య, భార్య నయనతారలపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తిరుచ్చి డీఎస్పీ ఈ కేసు దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇది నటి నయనతారకు కూడా తలనొప్పిగా మారింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)