Breaking News

వారివల్లే ఈ ప్రయాణం సాధ్యమైంది

Published on Tue, 10/17/2023 - 03:34

‘‘నా మొదటి సినిమా(కలియుగ పాండవులు) నుంచి ఇప్పుడు 75వ సినిమా ‘సైంధవ్‌’ వరకూ నన్ను ఎంతగానో ప్రేమించి, ఆదరించి, అభిమానిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత వల్లే ఈ ప్రయాణం సాధ్యపడింది. ఇందుకు ప్రేక్షకులకు, నా అభిమానులకు, చిత్ర పరిశ్రమకు ధన్యవాదాలు’’ అని హీరో వెంకటేశ్‌ అన్నారు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకటేశ్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘సైంధవ్‌’.

నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలక పాత్రల్లో నటించారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన  ‘సైంధవ్‌’ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 13న విడుదల కానుంది. ఈ మూవీ టీజర్‌ లాంచ్‌ వేడుకలో వెంకటేశ్‌ మాట్లాడుతూ– ‘‘బలమైన భావోద్వేగాలు, యాక్షన్‌కి అవకాశం ఉన్న కథ ‘సైంధవ్‌’. కుటుంబ ప్రేక్షకులందరికీ సినిమా నచ్చుతుంది. ఇందులో నన్ను కొత్తగా చూస్తారు.

గతంలో నా సినిమాలు ‘చంటి, కలిసుందాం రా, లక్ష్మి’ సంక్రాంతికి వచ్చి, హిట్‌ అయ్యాయి. ఇప్పుడు ‘సైంధవ్‌’ వస్తోంది. సంక్రాంతి రోజు ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూడబోతున్నారు’’ అన్నారు.  ‘‘ఈ మూవీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ. ‘‘వెంకటేశ్‌గారి ప్రతిష్టాత్మక 75వ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నారు శైలేష్‌ కొలను. ‘‘వెంకటేశ్‌గారితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు వెంకట్‌ బోయనపల్లి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)