బాక్సాఫీస్‌పై ‘ఛావా’ దండయాత్ర.. బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌!

Published on Sat, 02/15/2025 - 09:23

విక్కీ కౌశల్‌(Vicky Kaushal), రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఛావా’(Chhaava Movie).  మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి..తొలి రోజే హిట్‌ టాక్‌కి అందుకుంది. విక్కీ యాక్టింగ్‌తో పాటు దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ మేకింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా అద్భుతంగా తీశారని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. పాజిటివ్‌ టాక్‌ రావడంతో తొలి రోజే ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. 

మొదటి రోజు ఈ చిత్రం దాదాపు రూ.31 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్‌ వర్గాల అంచనా వేశాయి. ఈ ఏడాదిలో బాలీవుడ్‌లో ఇదే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌. విక్కీ కౌశల్‌ కెరీర్‌లోనే ఈ స్థాయి ఓపెనింగ్స్‌ రాబట్టిన తొలి చిత్రంగా ‘ఛావా’ నిలిచింది. గతంలో విక్కీ నటించిన సినిమాలలో తొలి రోజు అత్యధికంగా బాడ్ న్యూజ్(2024) రూ.8.62 కోట్లు, సామ్ బహదూర్ రూ.5.75 కోట్లు, జరా హాట్కే జరా బచ్కే రూ.5.49 కోట్లు సాధించాయి. ఛావా సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో వీకెండ్‌లో కలెక్షన్స్‌ భారీగా పెరిగే చాన్స్‌ ఉందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

విక్కీపై ప్రశంసలు..
‘ఛావా’విజయంలో విక్కీ కౌశల్‌ కీలక పాత్ర పోషించాడు.  శంభాజీగా విక్కీ కౌశల్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించాడని పలు వెబ్‌సైట్స్‌ తమ రివ్యూలో తెలిపాయి. వార్‌ యాక్షన్స్‌ అదరగొట్టేశాడట. క్లైమాక్స్‌ ఫైట్‌ సీన్‌లో వీక్కీ రుద్ర తాండవం చేశాడని చెబుతున్నారు. శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఉటేకర్‌ ఎంచుకున్న పాయింట్‌లో గొప్ప కథ, ఊహించని ట్విస్ట్‌లు లేకపోయినా శంభాజీ పాత్ర, యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాను నిలబెట్టాయి. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)