భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు
Breaking News
డేర్ డేవిల్‌లో వెంకటేశ్?
Published on Wed, 08/12/2026 - 06:07
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (2025) వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత హీరో అజిత్, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘డేర్ డేవిల్’. అజిత్ కెరీర్‌లోని ఈ 64వ సినిమాను బ్రేవ్ హార్ట్స్‌ప్రోడక్షన్స్ పతాకంపై ఆయన భార్య షాలినీ అజిత్‌కుమార్ నిర్మించనుండటం విశేషం. ఈ సినిమా చిత్రీకరణను అతి త్వరలోనే ప్రారంభించాలనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమాలోని నటీనటుల ఎంపికపై కూడా దృష్టి పెట్టారు దర్శకుడు అధిక్. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకు వెంకటేశ్‌ను సంప్రదించారట మేకర్స్.
కథ నచ్చడం, పైగా కథను మలుపు తిప్పే పాత్ర కావడంతో ఈ సినిమా చేసేందుకు దాదాపు ఓకే చె΄్పారట వెంకటేశ్. అంతే కాదండోయ్... ఈ చిత్రంలోని మరో కీలక పాత్రలో మోహన్‌లాల్ నటించనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
మరోవైపు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలోని ‘ఆదర్శ కుటుంబం–ఏకే 47’, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లోని ‘బామ్మర్ది బాల్‌రెడ్డి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాల్లో వెంకటేశ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆదర్శ కుటుంబం’ సినిమా అక్టోబరు 2న, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లోని చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి.
Tags : 1