Breaking News

'జయం మనదేరా'కు 25 ఏళ్లు.. 'థమ్స్ అప్‌'తో ఉన్న లింక్‌ ఏంటో తెలుసా?

Published on Tue, 10/07/2025 - 13:52

కులం కోసం కాదు... మనుషుల కోసం పోరాటం...! అనే మెసేజ్‌ ఇచ్చిన 'జయం మనదేరా' చిత్రానికి 25 ఏళ్లు. ఈ  మూవీతో కులాల మధ్య అంతరాన్ని తగ్గించే మెసేజ్ ఓరియెంటెడ్ కథతో వెంకటేష్‌ మెప్పించారు.   ఎన్‌.శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై నేటికి 25 సంవత్సరాలు పూర్తి అయింది. ఇందులో వెంకటేశ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించగా భానుప్రియ, సౌందర్య కథానాయికలుగా నటించారు. సురేష్ ప్రొడక్షన్స​్‌పై డి. సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.

2000లో విడుదలై సూపర్ డూపర్ హిట్‌గా 'జయం మనదేరా' నిలిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులతో పాటు  ఫిల్మ్‌ఫేర్ అవార్డులను పొందింది. వెంకటేష్ కెరీర్‌లో ఒక మైలురాయిగా ఈ మూవీ నిలవడమే కాకుండా.. ఆయన కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.  ఈ సినిమాలో వెంకటేష్‌.. మహదేవ నాయుడు, అభిరాం అనే రెండు పాత్రలు పోషించారు. అప్పట్లో ఇదో మాస్‌ సినిమాగా ప్రేక్షకులు ఆదరించారు.

'జయం మనదేరా'  మూవీ రూ. 16 కోట్ల మేరకు కలెక్షన్స్‌ రాబట్టి 2000 సంవత్సరంలో రెండోవ అతిపెద్ద గ్రాసర్‌గా నిలిచింది.  నైజాం ప్రాంతంలో ఆల్-టైమ్ మొదటి వారం రికార్డును క్రియేట్‌ చేయడమే కాకుండా.. చిరంజీవి నటించిన అన్నయ్య కలెక్షన్స్‌ను కూడా అధిగమించింది. అదే సంవత్సరం సంక్రాంతికి విడుదలైన (కలిసుందం రా) 18 కోట్ల షేర్‌తో ఆల్-టైమ్ బిగ్గెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. జయం మనదేరా చిత్రం 149 కేంద్రాలలో 114 ప్రింట్లతో విడుదల కాగా... 120 కేంద్రాల్లో 50 రోజులు, 33 కేంద్రాల్లో 100 రోజుల పాటు ప్రదర్శించారు. అలా 2000 సంవత్సరం వెంకటేష్‌కు ఇది గోల్డెన్‌ ఇయర్‌ అని చెప్పవచ్చు.

అయితే, ఈ సినిమాకు బ్రాండ్ ప్రమోషన్‌గా థమ్స్ అప్ కంపెనీ కొనసాగింది. సినిమా కోసం బ్రాండ్‌ ప్రమోషన్‌గా ఒక కంపెనీ నిలవడం అనేది ఇక్కడి నుంచే మొదలైంది. అందుకోసం ఆ కంపెనీ రూ.80 లక్షలు చెల్లించింది. ఆ డబ్బుతోనే ఈ సినిమా నిర్మించేందుకు కాస్త ఉపయోగపడిందని చెబుతారు. ఇది అప్పట్లో ఒక వ్యూహాత్మక నిర్ణయంగా నిలిచింది. ఈ మూవీ షూటింగ్‌ యూరప్‌లో 25 రోజులు  కొనసాగింది. ఆపై రెండు పాటలను యునైటెడ్ స్టేట్స్‌లో చిత్రీకరించారు. ఇలా ఇతర దేశాల్లో షూటింగ్‌ జరగడం ఆరోజుల్లో కాస్త అరుదుగానే జరిగేది. 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)