వెంకటేశ్- రానా సూపర్ హిట్‌ కాంబో.. టీజర్ వచ్చేసింది

Published on Mon, 02/03/2025 - 20:42

విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana Daggubati)నటించిన డార్క్‌ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్‌ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌కు కరణ్‌ అన్షుమాన్, సుపర్ణ్‌ ఎస్‌.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్‌ నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్‌ ఆరోన్, లోకోమోటివ్‌ గ్లోబల్‌ నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ విడుదలైంది.

ఈ సిరీస్‌కు ఆదరణ దక్కడంతో మేకర్స్ సీజన్‌-2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో రానా నాయుడు సీజన్-2 టీజర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. తాజాగా విడుదలైన అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. అమెరికన్‌ టీవీ సిరీస్‌ రే డొనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఈ సిరీస్‌తో రానా, వెంకటేశ్‌ మొదటి సారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. యాక్షన్‌, క్రైమ్‌ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు.

Videos

మాజీమంత్రి విడదల రజిని మానవత్వం.. గాయపడిన బాధితులకు తక్షణ సాయం

వరదకు ఎదురీది.. ప్రాణం కాపాడిన యువకుడు

మా వెనుక శేఖర్ మాస్టర్.. సుమలత మాకు అవసరం లేదు, మాకు రఘు మాస్టర్ బెస్ట్

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

అమెరికా పునాదులు కదిలిస్తాం?

డబ్బు కోసం స్నేహితుడినే కిడ్నాప్.. పట్టించిన వాట్సాప్ మెసేజ్

చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఇచ్చి ఒక నెల కూడా కాలేదు లోకేష్ ని ఏకిపారేసిన శ్రీదేవి

నచ్చకపోతే వెళ్లిపోండి జపాన్ క్రికెట్ CEO బీసీసీఐకి షాక్

దొంగతనం ఒప్పుకోమంటూ..! పోలీసుల వేధింపులపై అర్చకుడి తల్లి కన్నీళ్లు

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)