Breaking News

‘రానా నాయుడు’ నాకు కొత్త ప్రపంచం: వెంకటేశ్‌

Published on Wed, 03/08/2023 - 08:33

‘ఒక నటుడిగా కొత్త పాత్రలు చేయాలని ఎప్పుడూ ఉంటుంది. ‘రానా నాయుడు’లో నాగ నాయుడు పాత్రలో కొత్తగా చేయడానికి అవకాశం దొరికింది. ఇలాంటి పాత్రని నేను గతంలో చేయలేదు. సరికొత్తగా ఉండే నా పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని హీరో వెంకటేశ్‌ అన్నారు. కరణ్‌ అన్షుమాన్, సుపర్ణ్‌ ఎస్‌.వర్మ దర్శకత్వం వహించిన వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’. ఇందులో వెంకటేశ్‌ నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్‌ ఆరోన్, లోకోమోటివ్‌ గ్లోబల్‌ నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌ ఈ నెల 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వెంకటేశ్‌ మాట్లాడుతూ–‘‘రానా నాయుడు’ నాకు కొత్త ప్రపంచం. ఓటీటీలో చేయడం ఇదే మొదటిసారి. చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇందులో భావోద్వేగ సన్నివేశాలు చాలా కొత్తగా, పవర్‌ఫుల్‌గా ఉంటాయి. రానాతో తొలిసారి ఫుల్‌ లెంత్‌ స్క్రీన్‌ను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. కరణ్, సుపర్ణ్‌ వర్మలతో పని చేయడం గొప్ప ప్రయాణంలా అనిపించింది’’ అన్నారు.

రానా మాట్లాడుతూ– ‘‘రానా నాయుడు’ డార్క్‌ కామెడీ డ్రామా. ఇలాంటి కథలు సినిమాల్లో చేయడం కష్టం. హైదరాబాద్‌కి చెందిన ఓ కుటుంబం ముంబై వెళ్లి అక్కడ గ్యాంగ్‌స్టర్‌ పనులు చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆసక్తికర అంశాలు ఇందులో ఉంటాయి. ఈ సిరీస్‌ కోసం బాబాయ్‌తో (వెంకటేశ్‌) పని చేయడం మర్చిపోలేని అనుభూతి’’అన్నారు. ‘‘వెంకటేశ్, రానాగార్లతో పని చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు కరణ్‌ అన్షుమాన్, సుపర్ణ్‌ వర్మ. ‘‘రానా నాయుడు’ వీక్షకులను తప్పకుండా అలరిస్తుంది’’ అన్నారు నిర్మాత సుందర్‌ ఆరోన్‌.  

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)