Breaking News

‘మహానటి’కి మరణం లేదు: వెంకయ్య నాయుడు

Published on Sun, 12/07/2025 - 10:28

అందం, అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో మహానటిగా చెరగని ముద్ర వేశారు సావిత్రి. శనివారం (డిసెంబరు 6) ఆమె 90వ జయంతిని పురస్కరించుకుని సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో సంగమం ఫౌండేషన్‌ చైర్మన్‌ సంజయ్‌ కిశోర్‌ నిర్వహణలో హైదరాబాద్‌లో ‘సావిత్రి మహోత్సవం’ని ఘనంగా నిర్వహించారు. 

ఈ జయంతి ఉత్సవాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ– ‘‘మహానటికి మరణం లేదు. ప్రతి చిత్రంలో ఆమె పాత్ర మాత్రమే కనిపించేది తప్ప సావిత్రి కనిపించేది కాదు’’ అన్నారు.

ఈ వేదికపై ‘మహానటి’ చిత్రనిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్‌లను, అలాగే రచయిత సంజయ్‌ కిశోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్యలను సత్కరించారు. అదే విధంగా 90 మంది బాల గాయనీమణులు సావిత్రి పాటల పల్లవులను ఆలపించారు. ఇంకా సావిత్రి పాటల పోటీ విజేతలకు బహుమతులు అందించారు. నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మురళీమోహన్, తనికెళ్ల భరణి తదితరులు పాల్గొన్నారు.  

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి