Breaking News

‘వీరసింహారెడ్డి’ మూవీ ట్విటర్‌ రివ్యూ

Published on Thu, 01/12/2023 - 06:56

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్‌ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంకాంత్రి కానుకగా నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖండ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం కావడంతో ‘వీరసింహారెడ్డి’పై హైప్‌ క్రియేట్‌ అయింది.

దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ చూడాలని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్‌ వేదికగా చర్చించుకుంటున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. 

వీరసింహారెడ్డిపై ట్విటర్‌లో అటు పాజిటివ్‌..ఇటు నెగెటివ్‌ రెండు రకాల కామెంట్లు కనిపిస్తున్నాయి. ఫస్టాఫ్‌ రొటీన్‌గా, సెకండాఫ్‌ యావరేజ్‌గా ఉందని, బాలయ్య మాస్‌ మిస్‌ అయిందని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేస్తే..వీర సింహారెడ్డి మూవీతో మరోసారి బాలయ్య బాబు మాస్ జాతర షురూ అయిందని కొందరు చెబుతున్నారు. నందమూరి అభిమానులు కోరుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయని కామెంట్‌ చేస్తున్నారు. తమన్‌ నేపథ్య సంగీతం చాలా బాగుందని చెబుతున్నారు. 

పస్టాఫ్‌ బాగుంది. ఎలివేషన్స్‌, ఎమోషన్స్‌ వర్కౌట్‌ అయ్యాయి. పెళ్లి సీన్‌ ఫైట్‌, పులిచర్ల మైలు రాయి ఫైట్‌ సీన్‌తో పాటు మంత్రికి బాలయ్య ఇచ్చే వార్నింగ్‌ సన్నివేశం అదిరిపోయాయని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

Videos

వంశీ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు: పంకజశ్రీ

పేరుకు సీఎం.. చేసేది రౌడీయిజం

అమరావతిలో భవనాల నిర్మాణ వ్యయానికి రెక్కలు

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Photos

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)