జగనన్న పథకాలన్నీ చోరీ చేసి..దొంగ నాటకాలు... నాగార్జున యాదవ్ ఫైర్
Breaking News
VD 14 : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్
Published on Sat, 01/24/2026 - 18:05
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ని ఇప్పటి వరకు ప్రకటించలేదు. వీడీ14 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ ప్రారంభించారు. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా రౌడీ ఫ్యాన్స్‌కి మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమా టైటిల్‌ని జనవరి 26న అనౌన్స్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా బ్రిటీష్ కాలం నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది.
19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా "వీడీ 14" సినిమా రూపొందుతోంది. 'డియర్ కామ్రేడ్', 'ఖుషి' వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. 'టాక్సీవాలా' లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' తర్వాత "వీడీ 14"లో మూడోసారి రష్మిక, విజయ్ జంటగా కనిపించనున్నారు.
26.1.26.
Remember the date🔥
You will remember the name❤️🔥#VD14@TheDeverakonda @Rahul_Sankrityn @MythriOfficial #NiravShah #BhushanKumar #KrishanKumar @TSeries #ShivChanana @neerajkalyan_24 @vd14thefilm pic.twitter.com/07HL8UJqth— Mythri Movie Makers (@MythriOfficial) January 24, 2026
Tags : 1