Breaking News

యాక్షన్‌ ఓ హైలైట్‌

Published on Fri, 07/17/2026 - 03:20

‘‘వారణాసి’ చిత్రానికి యాక్షన్‌ సన్నివేశాలు ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు ప్రియాంకా చోప్రా . మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలజీ సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడుగా  రెండు పాత్రల్లో నటిస్తున్నారు మహేశ్‌బాబు. మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా , కుంభ పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్‌బాబు పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. 

తాజాగా ఈ సినిమా గురించి ప్రియాంకా చోప్రా  కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘‘వారణాసి’ కోసం 14 నెలలుగా నిరంతరాయంగా పని చేస్తున్నాను. ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. అలాగే ఈ సినిమాకి ఓ హైలైట్‌గా నిలుస్తాయి. ఈ చిత్రం కోసం కొన్ని స్లో మోషన్‌ జంప్స్‌తో కూడిన సన్నివేశాల్లో నటించాను’’ అని ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో ‘వారణాసి’ సినిమా గురించిన విశేషాలను చెప్పారు ప్రియాంకా చోప్రా . కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)