Breaking News

వరలక్ష్మి వెంటబడుతున్న తెలుగు డైరెక్టర్‌

Published on Fri, 08/11/2023 - 13:32

తెలుగు సినీ పరిశ్రమలో పవర్‌ఫుల్‌ లేడీ విలన్‌ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు 'రమ్యకృష్ణ'.  నరసింహా, నీలాంబరి చిత్రాల్లో హీరోకు సమానంగా ఆమె నటించిన తీరు అందరినీ మెప్పిస్తుంది. ఇప్పుడు జనరేషన్‌ మారింది. ఇప్పుడా ప్లేస్‌లోకి వరలక్ష్మి శరత్‌కుమార్‌ వచ్చేసిందని చాలామంది నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తుంటారు. అంతలా ఆమె తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది.

వరలక్ష్మికి తెలుగులో స్టార్‌ ఇమేజ్‌ అందించిన చిత్రం ‘క్రాక్‌’ . గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో జయమ్మగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఆ పాత్రలో ఆమె పలికించిన హావభావాలు తెలుగువారిని మెప్పించాయి. ముఖ్యంగా ఆమె బేస్‌ వాయిస్‌ ఈ పాత్రకు హైలైట్‌గా నిలిచింది. తరువాత ఇదే గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో వచ్చిన 'వీర సింహారెడ్డి' సినిమా తనకు మరింత పేరును తీసకువచ్చింది.

ఇదే ఏడాదిలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాతో వరలక్ష్మికి తెలుగులో మరో హిట్‌ అందుకుంది. ఇందులో ఆమె 'భానుమతి' పాత్రలో బాలయ్యకు సోదరిగా నటించి మరింత స్టార్‌ ఇమేజ్‌ను పెంచుకుంది. సీమ యాసలో ఆమె చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు సినీ ప్రియులను కట్టిపడేశాయి. ఈసినిమా విడుదలయ్యాకనే ఆమె నటన చూసే టాలీవుడ్‌ ఇండస్ట్రీకి మరో లేడీ విలన్‌ వచ్చేసిందంటూ అప్పట్లో వరుస కామెంట్స్‌ కూడా చేశారు.

వరలక్ష్మికి మరో ఛాన్స్‌
వరసు విజయాలతో ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న డైరెక్టర్‌ గోపీచంద్ మ‌ళ్లీ ర‌వితేజ‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన క్రాక్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌ సాధించింది. దీంతో మళ్లీ  మరో ప్రాజెక్ట్ పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చేసింది. ఇందులో కూడా  త‌న ల‌క్కీ ఛార్మ్ అయిన వ‌ర‌ల‌క్ష్మి కోసం ప్రత్యేక రోల్‌ను ఆయన క్రియేట్‌ చేస్తున్నాడట. ఈ సినిమా కోసం హీరోయిన్‌ ఎంపిక చేయడం కంటే ముందు వరలక్ష్మి ఎంపిక జరిగిపోయిందట. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఆమెను గోపీచంద్ ఇప్పటికే సంప్రదించాడని టాక్‌. ఇలా తన సినిమాలో జయమ్మ ఉంటే  అది సూపర్‌ హిట్‌ ఖాయం అని ఆయన భావిస్తున్నారట. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)