Breaking News

చాలా రోజుల తర్వాత ‘శబరి’లో  డ్యాన్స్‌ చేశా: వరలక్ష్మీ శరత్‌కుమార్‌

Published on Sat, 04/13/2024 - 10:34

‘తెలుగులో నేను చేసిన తొలి లేడీ ఓరియంటెడ్‌ చిత్రం ‘శబరి’. ఇది థ్రిల్లర్‌ మూవీ. తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఏం చేసింది? అనేది ఈ చిత్రకథ. చాలా రోజుల తర్వాత ఈ మూవీలో డ్యాన్స్‌ చేశాను’’ అని వరలక్ష్మీ శరత్‌కుమార్‌ అన్నారు. ఆమె లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘శబరి’. అనిల్‌ కాట్జ్‌ దర్శకత్వంలో మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న ఈ సినిమా విడుదలవుతోంది.

ఐదు భాషల ట్రైలర్స్‌ విడుదల వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. నటుడు వరుణ్‌ సందేశ్‌ తెలుగు ట్రైలర్‌ని, నిర్మాత మహేంద్రనాథ్‌ తమిళ ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. ‘‘నిర్మాత గురించి ఆలోచించే నటి వరలక్ష్మి. ‘శబరి’ నా తొలి సినిమా. ఆదరించాలి’’ అన్నారు మహేంద్రనాథ్‌ కూండ్ల. ఈ కార్యక్రమంలో నటుడు ఫణి, నటి సునయన , సినిమాటోగ్రాఫర్ నాని చమిడిశెట్టి, ఆర్ట్ డైరెక్టర్ ఆశిష్ తేజ్, కాస్ట్యూమ్ డిజైనర్ మానస నున్న, కొరియోగ్రాఫర్ రాజ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)