Breaking News

ప్రేమ... పగ

Published on Wed, 12/17/2025 - 01:30

నవీన్‌ చంద్ర, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన హారర్‌ థ్రిల్లర్‌ సినిమా పోలీస్‌ కంప్లైంట్‌’. సంజీవ్‌ మేగోటి దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ (తెలుగు, కన్నడ భాషల్లో..) ఈవెంట్‌లో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఫుల్‌ కామెడీ కూడా చేశాను. సినిమా బాగా వచ్చింది’’ అని చెప్పారు. సంజీవ్‌ మేగోటి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా షూటింగ్‌ను 45 రోజుల్లోనే పూర్తి చేశాం. ప్రేమ–పగ, తప్పు–ఒప్పు, మంచి–చెడుల మధ్య హైడ్‌ అండ్‌ సీక్‌ డ్రామాగా ఈ సినిమా సాగుతుంది.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రూపొందించాం. ఈ చిత్రంలో రాగిణి ద్వివేది చేసిన రోల్‌ థ్రిల్‌ చేస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్, కృష్ణసాయి, అడివి సాయికిరణ్, రావుల వెంకటేశ్వర రావు తదితరులు అతిథులుగా పాల్గొని, సినిమా యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వీ శ్రీనివాస్‌ రెడ్డి, సప్తగిరి, శరత్‌ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్‌ రమేశ్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఆరోహణ సుధీంద్ర – సంజీవ్‌ మేగోటి – సుధాకర్‌ మారియో సంగీతం అందించారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)