Breaking News

‘గం..గం..గణేశా’ ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తుంది : వంశీ కారుమంచి

Published on Tue, 05/28/2024 - 10:46

‘‘క్రైమ్, కామెడీ, యాక్షన్‌గా ‘గం..గం..గణేశా’ సినిమా రూపొందింది. మరీ ముఖ్యంగా ఇందులోని వినోదం ఆకట్టుకుంటుంది. మన స్నేహితుల్లో ఎవరో ఒకరు మనల్ని సమస్యల్లో ఇరికిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో వచ్చే వినోదం ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తుంది’’ అని నిర్మాత వంశీ కారుమంచి అన్నారు. ఆనంద్‌ దేవరకొండ హీరోగా, ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గం..గం.. గణేశా’. ఉదయ్‌ శెట్టి దర్శకుడు. 

హైలైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై వంశీ కారుమంచి, కేదార్‌ సెలగంశెట్టి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా వంశీ కారుమంచి మాట్లాడుతూ–‘‘నాది గుంటూరు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. అమెరికాలో ఉద్యోగం, వ్యాపారం చేశా. కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్‌ చేశాను. ఇండియాలోనే స్థిరపడాలనుకున్నప్పుడు సినిమాలు నిర్మించాలనే ఆలోచన ఉండేది. 

ఉదయ్‌ కథ చెప్పగానే ఆనంద్‌కి సరి΄ోతుందనిపించింది. కొంత ఆకతాయిగా, జులాయిగా ఉండే పాత్ర తనది. గణేష్‌ విగ్రహం, డబ్బుతో ముడిపడిన యాక్షన్‌ కామెడీ సినిమా ‘గం గం గణేశా’. ఇద్దరి హీరోయిన్ల పాత్రకి మంచి ప్రాధాన్యం ఉంది. సినిమా ఇండస్ట్రీ చూసేందుకు చిన్నదిగా కనిపించినా లక్షల మంది దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం రెండు కథలు ఫైనలైజ్‌ చేస్తున్నాం’’ అన్నారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)