Breaking News

ప్రేమంటే ఏమిటంటే.. కల్యాణ్‌ దేవ్‌ ఇలా.. శ్రీజ అలా..

Published on Wed, 02/15/2023 - 11:26

మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే. వీరిద్దరి పర్సనల్‌ లైఫ్‌పై ఇప్పుడు రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో వీరిద్దరు సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టులపై నెటిజన్స్‌ ఆసక్తి చూపిస్తున్నారు. అటు కల్యాణ్‌ దేవ్‌ కానీ, ఇటు శ్రీజ కానీ.. ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్‌ పెట్టిన అవి క్షణాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

తాజాగా ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14) పురస్కరించుకొని ప్రేమపై ఈ జంట విడి విడిగా పెట్టిన సోషల్‌ మీడియా పోస్టులు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వాలెంటైన్స్ డే విషెస్‌ తెలుపుతూ కల్యాణ్‌ దేవ్‌ ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్‌ పెట్టాడు.  మనం ఎంతగా ప్రేమిస్తున్నామని కాదు.. వాళ్లు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారనేది ముఖ్యం’ అని అందులో రాసుకొచ్చాడు.

మరోవైపు శ్రీజ కొణిదెల ప్రేమ గురించి చెబుతూ.. ‘లవ్‌ అంటే.. నీతో ప్రేమలో పడేసుకోవడం కాదు.. తనతో తనే ప్రేమలో పడేలా చేయడం.. ఉన్న ప్రేమను గుర్తించాలి.. ప్రేమ కోసం ఎక్కడో వెతకకూడదు’ అని చెప్పుకొచ్చింది.

ఈ రెండు పోస్టులు చూస్తుంటే ఒకరిపై ఒకరు కౌంటర్‌గా ఇలా చేశారనే విషయం అర్థమవుతుంది. అసలు వీరిద్దరు మధ్య గ్యాప్‌ ఎందుకు వచ్చిందనే విషయం ఎవరికీ అర్థం కావట్లేదు. సోషల్‌ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై ఇప్పటికీ ఈ జంట స్పందించకపోవడం గమనార్హం. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)