Breaking News

‘బేబీ’ గుర్తుకు రాకపోతే విజయం సాధించినట్టే: వైష్ణవి చైతన్య

Published on Tue, 09/08/2026 - 15:33

‘బేబీ’ తర్వాత ఆనంద్‌, నేను ఛాలెంజింగ్‌గా తీసుకొని ‘ఎపిక్‌’ చేశాం. ఈ సినిమా చూస్తున్నప్పుడు ‘బేబీ’ గుర్తుకురాకపోతే  మేము విజయం సాధించినట్టే. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం నాకు మొదటి నుంచి ఉంది’ అన్నారు తెలుగు బ్యూటీ వైష్ణవి చైతన్య. బ్లాక్ బస్టర్ 'బేబీ' జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. '90s' వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా వైష్ణవి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

మనం ఎన్నో లవ్ స్టోరీలు చూసుంటాం. కానీ, ప్రతి లవ్ స్టోరీలోనూ ఏదోక ప్రత్యేకత ఉంటుంది. ఎపిక్ లో కూడా ఆ ప్రత్యేకత ఉంది. భిన్న దారులు, భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరు యూకేకి చదువుకోవడానికి వెళ్లి, అక్కడ కలుస్తారు. లివ్ ఇన్ లో ఉంటారు. ఆ ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉంటాయో, ఆ సంభాషణల మీద నడిచే సినిమా. అమ్మాయి జీవితాన్ని ఒకలా చూస్తుంది. అబ్బాయి ఒకలా చూస్తాడు. అసలు వీరిద్దరూ ఎలా కలిశారు? వీరిద్దరి ఆలోచనలు ఏంటి? అనేది కొత్తదనాన్ని తీసుకొస్తుంది. ఈ సినిమాలో హంగామా ఉండదు. హత్తుకునేలా ఉంటుంది.

ఇందులో ఆనంద్ పోషించిన ఆదిత్య పాత్ర సాఫ్ట్ గా, కామ్ గా ఉంటుంది. జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి ఆదిత్య ఏం నేర్చుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. నేను పోషించిన కడలి పాత్ర స్ట్రాంగ్ అమ్మాయి. తన కోసం తాను నిలబడే అమ్మాయి. క్లారిటీ ఉన్న అమ్మాయి.

కడలి పాత్ర ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ, కుటుంబం వల్లనో, సమాజం వల్లనో మనలోని ఆ వెర్షన్ లోపలే ఉండిపోతుంది. బయటకు రాదు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదోక సమయంలో వారి కోసం వారు నిలబడాలి. అందుకే కడలి పాత్ర నా మనసుకు బాగా దగ్గరైంది.

కథలోనూ, నా పాత్రలోనూ కొత్తదనం ఉండాలి. ఆ పాత్రలో నన్ను నేను చూసుకోగలగాలి. ఎపిక్ ఎంచుకోవడానికి కారణమదే.

దర్శకుడు ఆదిత్యతో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉంటుంది. ఆయన జీవితాన్ని చాలా లోతుగా గమనిస్తుంటారు. జీవితంలో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ, అందులో ఉన్న ప్రాముఖ్యత గురించి మాట్లాడుతుంటారు. ఎపిక్ సినిమాలో కూడా అదే కనిపిస్తుంది. ఆదిత్య, కడలి పాత్రల మధ్య జరిగే చిన్న విషయాలకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూపిస్తారు. ఆదిత్య యూనిక్ డైరెక్టర్. నాకు బాగా ఇష్టమైన దర్శకులలో ఆయన ఒకరు.

నేను ఏదైనా విషయం బయట మాట్లాడాలంటే కాస్త భయపడుతుంటాను. కడలి పాత్ర ద్వారా నేనొక విషయం నేర్చుకున్నాను. ముందు మనల్ని మనం నమ్మాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి.

అమ్మాయిలు ఇండిపెండెంట్ గా ఉన్న సినిమాలు ఇప్పటికే చాలా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే.. ఒక సముద్రం లాంటి అమ్మాయి, తన జీవితంలో ఉన్న సమస్యను డీల్ చేస్తూ.. తన జీవితాన్ని ఎలా ముందుకు నడిపించింది అనేది ఉంటుంది. ఈ పాత్ర ద్వారా మంచి సందేశం కూడా ఉంటుంది.

ఈ సినిమాలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి మాట్లాడతాం కాబట్టి, 90s వెబ్ సిరీస్ అంత క్లీన్ ఎంటర్టైనర్ లా ఉండకపోవచ్చు. కానీ, దర్శకుడు ఆదిత్య ఈ సినిమాకి ఏది అవసరమో అది చూపిస్తూనే, ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా దృష్టిలో ఉంచుకొని ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. ఇబ్బందికర సన్నివేశాలు ఉండవు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూడొచ్చు.

కొత్త సినిమా విషయాలకొస్తే.. సితార బ్యానర్ లో నితిన్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే, తమిళ్ లో రెండు సినిమాలు, హిందీలో ఒక సినిమా చేస్తున్నాను.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)