Breaking News

ఆ సినిమా రీమేక్‌లో నటించాలని ఉంది

Published on Fri, 09/02/2022 - 00:26

‘‘రంగ రంగ వైభవంగా’లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అందమైన ప్రేమకథ, భావోద్వేగాలు, ఫ్యామిలీ డ్రామా.. ఇలా అన్నీ ఉన్నాయి.  ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు వైష్ణవ్‌ తేజ్‌. గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్, కేతికా శర్మ జంటగా నటించిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. బాపినీడు .బి సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వైష్ణవ్‌ తేజ్‌ పంచుకున్న విశేషాలు.

► నా సినిమా కథల ఎంపికలో ఓ ప్రేక్షకునిగా ఆలోచిస్తాను. ఈ విషయంలో సాయిధరమ్‌ తేజ్‌ (వైష్ణవ్‌ అన్న) తో పాటు ఎవరి సపోర్ట్‌ తీసుకోను. నేనే ఎంచుకుంటున్నాను. గిరీశాయ కథ చెప్పిన విధానం, కథపై ఆయనకు ఉన్న నమ్మకం నచ్చింది. పైగా ఆయన మంచి అనుభవం ఉన్న దర్శకుడు. అందుకే ‘రంగ రంగ వైభవంగా’ చేశా.

► ఈ సినిమాలో చాలామంది సీనియర్‌ నటీనటులున్నారు. సీనియర్స్‌తో నటించడం వల్ల వారి అనుభవం, అంకితభావం వంటి విషయాలు తెలుసుకున్నాను. నటన విషయంలో మెగా ఫ్యామిలీలోని అందరి నుంచి స్ఫూర్తి పొందుతుంటాను.

► బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌గారి లాంటి సీనియర్‌ నిర్మాత బేనర్‌లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఆయనే మంచి టీమ్‌ని సెట్‌ చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. శ్యామ్‌దత్‌గారు మంచి విజువల్స్‌ ఇచ్చారు.

► ‘ఉప్పెన’తో నాకు పెద్ద హిట్‌ వచ్చింది. ఆ తర్వాత చేసిన ‘కొండపొలం’ మేము అనుకున్నంతగా ఆడలేదు.. అందుకు ఎలాంటి బాధ లేదు. నా ప్రతి సినిమా రొటీన్‌గా కాకుండా వైవిధ్యంగా ఉండాలనుకుంటాను. పెదనాన్న (చిరంజీవి), బాబాయ్‌ (పవన్‌ కల్యాణ్‌) సినిమాలను నేను రీమేక్‌ చేయడమంటే సాహసమే. మంచి కథ కుదిరి, డైరెక్టర్‌ నన్ను కన్విన్స్‌ చేయగలిగితే ‘బద్రి’ సినిమా రీమేక్‌లో నటించాలనుంది. ప్రస్తుతం సితార బ్యానర్‌లో కొత్త డైరెక్టర్‌ శ్రీకాంత్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను.  

Videos

మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి

ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ.. కవితకు నో ఎంట్రీ..!

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై శ్యామల కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు

ఇంత నీచానికి దిగజారాలా.. నిజాయితీ గల అధికారిపై కిలాడీ లేడితో కుట్ర

జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు

కవిత లేఖపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

Photos

+5

అమ్మ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన హీరోయిన్‌ లయ.. ఫోటోలు

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)