Breaking News

నా పరిస్థితి నా కూతురికి రాకూడదు: ఊర్వశి

Published on Mon, 04/28/2025 - 13:13

అమాయకపు అమ్మ పాత్రలు, కామెడీ రోల్స్‌తో అందరికీ చేరువైంది నటి ఊర్వశి (Urvashi). చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఊర్వశి తర్వాత హీరోయిన్‌గా, అనంతరం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారింది. దక్షిణాదిలో వందలాది సినిమాలు చేసిన ఈమెకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. త్వరలోనే కూతురు కూడా సినిమాల్లో ఎంట్రీ ఇస్తుందని ఇటీవలే వెల్లడించింది.

నటిని మాత్రమే
అయితే అంతకన్నా ముందు ఆమె భర్త శివప్రసాద్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'ఎల్‌. జగదాంబ 7th క్లాస్‌ బి' అనే సినిమా చేశాడు. ఊర్వశి లేకుండా ఈ సినిమా ఎలా ఉంటుంది? తాజాగా ఈ సినిమా విషయాలను ఊర్వశి పంచుకుంది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సెట్స్‌లో అడుగుపెట్టాక నేను నటిని మాత్రమే! దర్శకుడు నా భర్తే కదా అని రిలాక్స్‌ అయిపోను. కెమెరా ముందు ఆయన చెప్పినట్లు నటించడమే నా పని.

నటి ఊర్వశి, కూతురు తేజ లక్ష్మి

నా పరిస్థితి కూతురికి రాకూడదు
అయితే ఈ సినిమాల వల్ల నేను చదువు మధ్యలో మానేయాల్సి వచ్చింది. నా కూతురికి అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకున్నాను. ముందు తన చదువు పూర్తి చేయమన్నాను. మంచి ఉద్యోగం సంపాదించమన్నాను. ఆ తర్వాతే సినిమాలపై ఆసక్తి ఉంటే ఈ ఇండస్ట్రీకి రావాలన్నాను. తన కాళ్లపై తను నిలబడిన తర్వాతే సినిమాల గురించి ఆలోచించమని చెప్పాను.

ఆఫర్స్‌ వస్తున్నాయ్‌
ఈ మధ్యే నా కూతురి పైచదువులు పూర్తయ్యాయి. ఇప్పుడు తనకు నచ్చినట్లు చేసుకోనీ.. మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి. తనే స్వయంగా కథ విని, చేయాలా? వద్దా? అని నిర్ణయించుకుంటుంది. ఈ రోజుల్లో అమ్మాయిలు కెరీర్‌, జీవితం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తను నటనను ఎంచుకుంటే తల్లిగా అది నాకు సంతోషమే అని చెప్పుకొచ్చింది.

పర్సనల్‌ లైఫ్‌
నటి ఊర్వశి, నటుడు మనోజ్ జయన్‌ను 2000లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్లకు తేజ లక్ష్మి సంతానం. మనోజ్‌తో విభేదాలు రావడంతో అతడి దగ్గర విడాకులు తీసుకుంది. అనంతరం 2013లో శివ ప్రసాద్‌ని పెళ్లి చేసుకుంది. వీరికి ఇషాన్‌ అనే కుమారుడు సంతానం ప్రస్తుతం అతడితోనే కలిసి జీవిస్తోంది. కానీ తేజలక్ష్మి మాత్రం తన తండ్రి మనోజ్‌తో కలిసి ఉంటోంది.

చదవండి: దుస్తులు తీసేయమన్నాడు.. చేదు అనుభవం బయటపెట్టిన నటి

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)