Breaking News

ఓటీటీలో పోటాపోటీగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌

Published on Thu, 07/03/2025 - 17:54

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసును ఆధారంగా చేసుకుని తెరకెక్కిన 'ది హంట్‌'  వెబ్‌ సిరీస్‌ జులై 4న ఓటీటీలో విడుదల కానుంది. 'సోనీలివ్‌' (SonyLiv) వేదికగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌ వర్షన్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. నగేశ్‌ కుకునూర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో  అమిత్‌ సియాల్‌తో పాటు సాహిల్‌ వైద్‌, భగవతీ పెరుమాళ్‌ తదితరులు నటించారు.  1991, మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌లో నాటి దేశ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో రాజీవ్‌ గాంధీ హతమయ్యారు. అయితే, ఈ హత్యకు వారి ఉద్దేశ్యం ఏంటి..? హత్య, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి అనే  కోణాల్లో ఈ మూవీ ఉండనుంది.

హీరోయిన్‌ కీర్తి సురేశ్‌(Keerthy Suresh)- హీరో సుహాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'ఉప్పు కప్పురంబు' (Uppu Kappurambu). ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్‌ అవుతుంది. ఐవి శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎల్లనార్‌ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై రాధికా లావు నిర్మించారు. సినిమా బండి ఫేమ్‌ వసంత్‌ కథ అందించారు. జులై 4వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌(Amazon Prime Video) లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.

మణిరత్నం దర్శకత్వం వహించిన 'థగ్‌ లైఫ్‌' (Thug life)  ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీలో కమల్‌ హాసన్‌ (Kamal Haasan) కథానాయకుడిగా, శింబు, త్రిష, నాజర్‌ కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. జులై 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం,హిందీ మలయాళం,  కన్నడలో ఉంది. బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది.

నటి, దర్శకురాలు రేవతి తెరకెక్కించిన  ‘గుడ్‌వైఫ్‌’ (Good Wife) వెబ్‌సిరీస్‌ జులై 4న విడుదల కానుంది. ఇందులో ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో నటించారు. ఆమెకు భర్తగా సంపత్‌ రాజ్‌ నటించారు.  'జియో హాట్‌స్టార్‌' (Jio Hotstar) వేదికగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీలో స్ట్రీమింగ్‌ కానుంది. అమెరికన్‌ సిరీస్‌ 'ది గుడ్‌వైఫ్‌' ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్‌ను ఇండియాలో తెరకెక్కించారు.

Videos

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)