Breaking News

డేట్‌ ఛేంజ్‌

Published on Sun, 02/15/2026 - 05:12

ఎస్‌... ఫలానా డేట్‌కి థియేటర్స్‌కి వచ్చేస్తాం అంటూ యూనిట్‌ ఒక డేట్‌ ఫిక్స్‌ చేసి, ప్రకటిస్తుంది. అయితే కొన్నిసార్లు సెట్‌ చేసిన డేట్‌కి ఆ సినిమా రాదు... వాయిదా పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా వాయిదా వేస్తుంటారు. కొన్ని సినిమాల  షూటింగ్‌ పూర్తి కాదు... కొన్ని పూర్తయినా గ్రాఫిక్స్‌ పూర్తి కావు... కొన్నయితే అన్నీ పూర్తయినా వేరే సినిమాలతో క్లాష్‌ అయ్యే పరిస్థితిలో తప్పక వాయిదా పడతాయి. కారణాలు ఏమైనప్పటికీ ఈ మధ్య కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ఆ చిత్రాల పోస్ట్‌పోన్‌ స్టోరీ తెలుసుకుందాం.

వేసవిలో విశ్వంభర 
చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ మూవీ ఫేమ్‌ వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. ‘శుభలేఖ’ సుధాకర్, కునాల్‌ కపూర్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, రావు రమేశ్, రాజీవ్‌ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విక్రమ్‌ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మించారు. ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ మూవీ రిలీజ్‌ వాయిదా పడింది.

ఇందుకు కారణం... చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన ‘గేమ్‌ చేంజర్‌’ సినిమా. తనయుడి ‘గేమ్‌ చేంజర్‌’ కోసం తన ‘విశ్వంభర’ మూవీ విడుదలని చిరంజీవి వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్‌ చేంజర్‌’ 2025 జనవరి 10న రిలీజ్‌ అయింది. 2025 సంక్రాంతికి వాయిదా పడిన ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందని భావించినప్పటికీ కాలేదు. ఇందుకు కారణం వీఎఫ్‌ఎక్స్‌ పనులు. ఈ కారణంగా చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి జనవరి 12న విడుదలైంది.

అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించగా, వెంకటేశ్‌ ముఖ్య పాత్ర పోషించారు. అర్చన సమర్పణలో షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై, సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇక 2025 జనవరి 10న రిలీజ్‌ వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ వేసవికి ప్రేక్షకుల  ముందుకు వస్తుందని చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి... విడుదల తేదీపై స్పష్టత రావాలి.  
 
మార్చి టు ఏప్రిల్‌ 
రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ‘పెద్ది’. ‘ఉప్పెన’ మూవీ ఫేమ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్‌ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీని రామ్‌చరణ్‌ బర్త్‌ డే కానుకగా మార్చి 27న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మార్చి నుంచి ఏప్రిల్‌ 30కి విడుదల వాయిదా వేశారు.

 ‘‘రామ్‌చరణ్‌ హీరోగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్‌ ఇండియా స్పోర్ట్స్, యాక్షన్‌ డ్రామా ‘పెద్ది’. హైలీ యాంటిసిపేటెడ్‌ రూరల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ కోసం రామ్‌చరణ్‌ ఫుల్‌æమాస్‌ లుక్‌లోకి మారిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. మార్చి 27న ఈ సినిమాని విడుదల చేయాలని భావించాం. అయితే వేసవి సెలవుల్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్‌ 30కి మార్చాం. 

మా సినిమా  ఇప్పటికే ప్రమోషనల్‌ కంటెంట్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఫస్ట్‌ గ్లింప్స్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లతో పాటు ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరిచిన ‘చికిరి చికిరి...’ పాట అన్ని ప్లాట్‌ఫామ్‌లలో అద్భుతమైన స్పందనను అందుకుంది. ఈ పాట 200 మిలియన్ల వ్యూస్‌ దాటి సినిమాపై అంచనాలను భారీగా పెంచింది’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది. ఇదిలా ఉంటే... ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన పవన్‌ కల్యాణ్‌ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ ముందుకు వచ్చి, మార్చి 26న రిలీజ్‌ కానుంది.  
  
మార్చి నుంచి ఆగస్టుకి...  
‘దసరా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో నాని, డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్‌’. మంచు మోహన్‌ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ‘కిల్, గ్యారా గ్యారా’ వంటి హిందీ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న రాఘవ్‌ జుయల్‌ ‘ది ప్యారడైజ్‌’లో భాగమయ్యారు. ఓ కీలక పాత్రను సంపూర్ణేష్‌ బాబు చేస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. పీరియాడికల్‌ యాక్షన్‌  డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో జడల్‌ అనే పాత్రలో నాని నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. నానిపై ‘ఆయా షేర్‌..’ అంటూ సాగే ఇంట్రో సాంగ్‌ చిత్రీకరిస్తున్నారు. 

వందలాది డ్యాన్సర్లతో భారీ సెట్లో తెరకెక్కుతున్న ఈ పాటకు అనిరుధ్‌ రవిచందర్‌ హై వోల్టేజ్‌ మాస్‌ ట్యూన్‌ అందించారు. కొరియోగ్రాఫర్‌ సుధన్‌ మాస్టర్‌ భారీ విజువల్స్‌తో ఈ సాంగ్‌ని పూర్తి స్థాయి క్రౌడ్‌ ప్లీజర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్‌ భాషల్లో మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పోస్ట్‌పోస్‌ చేసి, ఆగస్టు 21న విడుదల చేయనున్నారు.  ‘‘మ్యాసివ్‌ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ హాటెస్ట్‌ పాన్‌ ఇండియన్‌ రిలీజెస్‌లో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది.

 మా సినిమాని ముందుగా మార్చి 26న విడుదల చేయాలనుకున్నాం. అయితే తాజాగా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రిలీజ్‌ డేట్‌కి మా సినిమాకు వరుసగా మూడు వారాల పండగలు కలిసి రానున్నాయి. మొదటి వారంలో ఓనం, మిలాద్‌–ఉన్‌–నబీ పండగలు, రెండో వీకెండ్‌లో రాఖీ, మూడో వారంలో జన్మాష్టమి ఉండటం వల్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైస్‌’కి బాక్సాఫీస్‌ వద్ద బిగ్‌ అడ్వాంటేజ్‌ అవుతుంది. ప్లానింగ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నాని... ఈ నిర్ణయంతో మరోసారి తన మార్కెటింగ్‌ సెన్స్‌ని చూపించారు’’ అని చిత్రబృందం ప్రకటించింది.  
 
ఫిబ్రవరి టు ఏప్రిల్‌...  
‘కార్తికేయ 2’ వంటి పాన్‌ ఇండియా హిట్‌ తర్వాత నిఖిల్‌ నటించిన మరో పాన్‌ ఇండియా చిత్రం ‘స్వయంభు’. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్‌ మధు సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై భువన్, శ్రీకర్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్‌ భాషల్లో ఈ నెల 13న రిలీజ్‌ చేస్తామని యూనిట్‌ ఇప్పటికే అనౌన్స్‌ చేసింది. అయితే ఆ తేదీకి విడుదల వాయిదా పడి, ఏప్రిల్‌ 10న రిలీజ్‌ కానుంది. 

నిఖిల్‌ సిద్ధార్థ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమాలో నిఖిల్‌ పవర్‌ఫుల్‌ వారియర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్‌ప్రోడక్షన్‌ పనులు... ముఖ్యంగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఇంకా పెండింగ్‌లో ఉన్నాయట. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని భావిస్తున్న యూనిట్‌... కొంచెం ఆలస్యమైనా సరే బెస్ట్‌ ఔట్‌పుట్‌ ఇవ్వాలని నిర్ణయించుకుని ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్‌ 10కి వాయిదా వేసినట్లు టాక్‌. ఈ మూవీ 2డీ, త్రీడీ ఫార్మాట్‌లో విడుదల కానుంది.

1000 ఏళ్ల క్రితం రాయలసీమలోని చిత్తూరు ప్రాంతంలో కృష్ణ అనే యోధుడు ఉండేవాడు. అల్లరిగా తిరిగే అండర్‌ డాగ్‌ రాజ్యాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ‘సలార్‌’ మూవీ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెంచింది. అదే విధంగా సెంథిల్‌ కుమార్‌ విజువల్స్‌ ఈ మూవీకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి.  

మే 1న లెనిన్‌ వస్తాడా?  
అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్‌’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీ ఫేమ్‌ మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై అక్కినేని నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీలో అఖిల్‌ ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ‘లెనిన్‌’ని మే 1న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. అయితే... ఆ తేదీకి రిలీజ్‌ కాకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానికి కారణం రామ్‌చరణ్‌ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా అని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

మార్చి 27న ‘పెద్ది’ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మార్చి నుంచి ఏప్రిల్‌ 30కి విడుదల వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ‘లెనిన్‌’ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని టాక్‌. ‘లెనిన్‌’ని మే 1న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే  కొత్త విడుదల తేదీపై మేకర్స్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి... ముందుగా అనుకున్నట్లు ‘లెనిన్‌’ మే 1న ప్రేక్షకుల ముందుకు వస్తాడా? లేదా? లేకుంటే మరో కొత్త రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తారా? అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ‘లెనిన్‌’ పై అక్కినేని ఫ్యాన్స్‌ చాలా ఆశలే పెట్టుకున్నారు.  ఈ మూవీ తప్పకుండా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.  

మార్చి నుంచి ఏప్రిల్‌కి? 
అడివి శేష్‌ హీరోగా రూపొందిన తాజా పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ‘డెకాయిట్‌’. షానియల్‌ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించగా, డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ నిర్మించారు. సునీల్‌ నారంగ్‌ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ కానుకగా 2025 డిసెంబరు 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తేదీకి రిలీజ్‌ని పోస్ట్‌పోన్‌ చేసి, ఉగాది కానుకగా ఈ ఏడాది మార్చి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా అడివి శేష్, మృణాల్‌ ఠాకూర్‌ ఇంటెన్స్‌ లుక్స్‌లో ఉన్న రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే ఈ మూవీ మరోసారి విడుదల వాయిదా పడనుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. మార్చి నెలలో యశ్‌ ‘టాక్సిక్‌’, రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్‌ 2’ వంటి సినిమాలు ఆడియన్స్‌ ముందుకి వస్తుండటంతో ‘డెకాయిట్‌’ విడుదల వాయిదా పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. వేసవి కానుకగా ఏప్రిల్‌ 10న రిలీజ్‌ కానుందనే చర్చ నడుస్తోంది. అయితే మార్చి 19న విడుదల వాయిదా గురించి చిత్రయూనిట్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

‘‘ప్రేమ, ప్రతీకారం నేపథ్యంలో థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘డెకాయిట్‌’. ఇప్పటికే విడుదలైన ఫైర్‌ గ్లింప్స్‌లోని ఇంటెన్స్‌ యాక్షన్, స్టైలిష్‌ విజువల్స్‌కి పాన్‌ ఇండియా స్థాయిలో మంచి స్పందన వచ్చింది. బాలీవుడ్‌ డైరెక్టర్, నటుడు అనురాగ్‌ కశ్యప్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తారు. ఆయన నటించిన తొలి తెలుగు చిత్రం మాదే. 
అంతర్జాతీయ స్థాయిలో తీసిన ‘డెకాయిట్‌’ని ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం మా మూవీకి ప్లస్‌ అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే... యూనిట్‌ ముందుగా ప్రకటించినట్లు మార్చి 19న ‘డెకాయిట్‌’ సినిమా విడుదలవుతుందా? లేదా అనేది వేచి చూడాలి.   

సంబరాలు ఎప్పుడు?  
 సాయిదుర్గా తేజ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు (ఎస్‌వైజీ). ఐశ్వర్యా లక్ష్మి, జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ద్వారా రోహిత్‌ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘హనుమాన్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ నిర్మించిన కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ‘సంబరాల ఏటిగట్టు’ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2025 సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు యూనిట్‌ తొలుత ప్రకటించినప్పటికీ పోస్ట్‌పోన్‌ అయింది.

అయితే ఆ తర్వాత విడుదల తేదీపై యూనిట్‌ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, మార్చి 14న థియేటర్లలోకి రానుందని టాక్‌.  ‘‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం రూ. 125 కోట్లకు పైగా బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందింది. సాయిదుర్గా తేజ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ ప్రాజెక్ట్‌గా ఈ మూవీ నిలుస్తుంది. మా సినిమాలోని సీజీ వర్క్‌ ఆడియన్స్‌కి గ్రేట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. వెట్రి పళనిసామి విజువల్స్, బి. అజనీష్‌ లోక్‌నాథ్‌  సంగీతం అదనపు ఆకర్షణలు’’ అని యూనిట్‌ తెలిపింది.  

నాయకుడు వచ్చేదెప్పుడు?  
తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్‌’ (తెలుగులో ‘జన నాయకుడు’). హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయ్‌ కెరీర్‌లో 69వ మూవీ. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో మమితా బైజు, బాబీ డియోల్‌ కీలక పాత్ర పోషించారు. కేవీఎన్‌ప్రోడక్షన్స్‌ పతాకంపై వెంకట్‌ కె. నారాయణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా పొంగల్‌ కానుకగా ఈ ఏడాది జనవరి 9 విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కొత్త విడుదల తేదీపై ఎలాంటి ప్రకటన రాలేదు.

విజయ్‌ ఇప్పటికే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ కారణంగా ఆయన సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. అందుకే విజయ్‌ నటించిన చివరి చిత్రం ‘జన నాయకుడు’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచింది. ఈ మూవీకి అనిరుధ్‌ రవిచందర్‌ అందించిన సంగీతానికి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం సెన్సార్‌ ఇబ్బందుల్లో ఉంది. మరి... అడ్డంకులు దాటుకుని ‘జన నాయకుడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చేదెప్పుడు? అన్నది వేచి చూడాలి.

– డేరంగుల జగన్‌ మోహన్‌ 

Videos

బడ్జెట్ లో నిరుద్యోగులకు టోకరా.. బాబుపై 420 కేసు!?

ఇది రాష్ట్రం కోసం పెట్టిన బడ్జెట్ కాదు జగన్ కోసం పెట్టిన బడ్జెట్..

చెయ్యి ఆయనది, గడ్డం ఆయనది.. మీకేంటి నొప్పి?

అనిత ఓవరాక్షన్ కు అంబటి కూతురు ఊర మాస్ వార్నింగ్

కాపుతో పెట్టుకున్నారు.. వంగవీటి నరేంద్ర మాస్ వార్నింగ్

పవన్ వారసుడు అకీరా ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?

చంద్రబాబు లడ్డూ కల్తీ జరిగిందని చెప్పడానికి అసలు కారణం ఇదే..

నీకు అంత దమ్ముంటే హెరిటేజ్ నాది కాదు అని చెప్పు

ఛత్తీస్ గఢ్ లోని దాంతరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

పంచారామ క్షేత్రంలో అపచారం

Photos

+5

బ్రహ్మమురారి.. సురార్చితలింగం (ఫొటోలు)

+5

సాహసం శ్వాసగా సాగిపో: విశాఖలో నేవీ విన్యాసాలు (ఫొటోలు)

+5

విశ్వక్‌సేన్‌ 'ఫంకీ' సక్సెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రావెల్‌ అడ్వెంచర్‌ టాక్‌ షో 'సోల్‌ ట్రిప్‌' (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నరేశ్‌- పవిత్ర (ఫోటోలు)

+5

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ ! (ఫొటోలు)

+5

డాక్టర్‌గా హీరోయిన్ శ్రీలీల.. పట్టా అందుకున్న మధుర క్షణాలు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ హల్దీ వేడుక (ఫొటోలు)

+5

క్రిస్టల్‌ ఐవరీ లెహంగాలో పాలరాతి శిల్పంలా రాధికా స్టన్నింగ్‌ లుక్స్‌ ..! (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మరో డాక్టర్ (ఫొటోలు)