Breaking News

'అన్‌స్టాపబుల్' షోలో వెంకటేశ్.. ప్రోమో రిలీజ్

Published on Tue, 12/24/2024 - 13:05

అన్‌స్టాపబుల్ (Unstoppable with NBK) ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తోంది. ఇదివరకే ఆరు ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి. ఇప్పుడు కొత్త ఎపిసోడ్ కోసం విక్టరీ వెంకటేశ్ (Venkatesh) వచ్చారు. ఈయన లేటెస్ట్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunam). ఈ మూవీ సంగతులతో పాటు బోలెడన్ని విషయాల్ని పంచుకున్నారు. హోస్ట్ బాలకృష్ణతో కలిసి వెంకీ ఫుల్ సందడి చేశారు. వెంకీతో పాటు ఈయన అన్నయ్య సురేశ్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి కూడా ఇదే ఎపిసోడ్‌లో పాల్గొన్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోనే టాప్ సిరీస్.. రెండో సీజన్ చూసేందుకు సిద్ధమా?)

లేటెస్ట్‌గా రిలీజైన ప్రోమోలో వెంకీ, బాలకృష్ణ ఒకరి సినిమాకు మరొకరు హైప్ ఇచ్చుకున్నారు.  వెంకటేష్ 'డాకు మహారాజ్' (Daaku Maharaj) అని హైప్ ఇవ్వగా, బాలకృష్ణ అందుకొని 'నా మనసులో నువ్వే మహారాజ్' అని డైలాగ్ వేశారు. ఆ తర్వాత గతాన్ని గుర్తు తెచ్చుకుని మాట్లాడుకున్నారు. 'రాముడు మంచి బాలుడు' అనే డైలాగ్ చెప్పి బాలయ్య సిగ్గుపడుతుంటే.. వెంకటేష్ అందుకుని 'హలో కొంపతీసి నువ్వా రాముడు?' అని సెటైర్ వేశారు. ఆ వెంటనే బాలయ్య.. 'అలా భయపెట్టిస్తే ఎలా' అని పంచ్ వేశారు.

ఇదే షోలో వెంకటేశ్.. నాగచైతన్య, రానాతో తనకున్న బాండింగ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. సోదరుడు సురేశ్ బాబు కూడా షోకి వచ్చారు. వెంకటేష్ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం చెబుతూ ఎమోషనల్ అయ్యారు. డిసెంబర్ 27న రాత్రి 7 గంటలకు పూర్తి ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 

(ఇదీ చదవండి: సినిమాల్ని వదిలేద్దాం అనుకుంటున్నా: డైరెక్టర్ సుకుమార్)

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)