Breaking News

'24 ఏళ్లుగా అక్కడే ఉన్నా.. నేను, నా స్నేహితులు షాకయ్యాం '

Published on Fri, 06/13/2025 - 18:59

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం మాలీవుడ్ హీరో ఉన్ని ముకుందన్‌ స్పందించారు. అక్కడే దాదాపు 24 ఏళ్లు నివసించానని తెలిపారు. తాను నివాసమున్న ప్రదేశానికి  పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘనినగర్‌లో విమాన ప్రమాదం జరిగిందని అన్నారు. నా బాల్యమంతా అక్కడే గడిచిందని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. తాను నివసించిన ప్రాంతంలో ఈ విషాదం జరగడం నన్ను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ ఘటన విన్న వెంటనే తాను, తన పాఠశాల స్నేహితులు షాక్‌లో ఉన్నామని తెలిపారు. కాగా.. కేరళలోని త్రిసూర్‌లో జన్మించిన ఉన్ని ముకుందన్‌ అహ్మదాబాద్‌లోని మణినగర్‌లో పెరిగారు.

అంతకుముందు బాధితుల కుటుంబాలకు తన సంతాపాన్ని ప్రకటించారు. క్లిష్ట సమయంలో ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ శాంతి చేకూరాలని ఉన్ని ముకుందన్‌ పోస్ట్ చేశారు. ఈ ప్రమాదంపై పలువురు సినీతారలు సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. కాగా.. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొద్ది క్షణాల్లోనే  కూలిపోయింది. మేఘనినగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి హాస్టల్‌ భవనంపై విమానం కూలిపోవడంతో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా 265 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక ఉన్ని ముకుందన్ సినీ కెరీర్ విషయానికొస్తే 'సీడన్' అనే తమిళ చిత్రంతో  అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 'మల్లూ సింగ్'లో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత 'విక్రమాదిత్యన్', 'కెఎల్ 10 పట్టు', 'స్టైల్', 'ఒరు మురై', ​​'వంతు పార్థయ', 'అచాయన్స్', 'మాలికప్పురం' 'మార్కో' చిత్రాలతో అభిమానులను అలరించారు. నిర్మాతహా తన తొలి చిత్రం'మెప్పడియాన్‌'కి జాతీయ అవార్డు అందుకున్నారు.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)