Breaking News

ముద్దు, రొమాంటిక్‌ సీన్ల కోసం నాపై ఒత్తిడి తెచ్చారు: హీరో

Published on Sun, 02/23/2025 - 17:15

ముద్దు సన్నివేశాలు అనేవి ఇప్పటి సినిమాల్లో కామన్‌ అయిపోయాయి. స్టార్‌ హీరోహీరోయిన్లు సైతం ఇలాంటి ఇంటిమేట్‌ సీన్లకు సై అంటున్నారు. కథ డిమాండ్‌ చేస్తే..‘ఎలాంటి’ సీన్‌ అయినా చేయడానికి రెడీ అంటూ హీరోయిన్లు సైతం ముందుకొస్తున్నారు. ఇండియన్‌ సినిమాల్లో ఇంటిమేట్‌ విప్లవం నడుస్తోన్న ఇలాంటి రోజుల్లో ఓ హీరో మాత్రం తను ముద్దు, రొమాన్స్‌ సన్నివేశల్లో నటించబోనని తెగేసి చెబుతున్నాడు. 

దర్శక నిర్మాతలు ఎంత ఒత్తిడి తెచ్చినా.. తాను మాత్రం అలాంటి సీన్లు అంగీకరించబోనని అంటున్నాడు. ఆ యంగ్‌ హీరో పేరే ఉన్ని ముకుందన్‌(Unni Mukundan). మలయాళ హీరో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల కూడా ఉన్ని ముకుందన్‌ పరిచయమే. ‘జనతా గ్యారేజ్‌’, ‘భాగమతి’, ‘ఖిలాడి’, ‘యశోద’ వంటి తెలుగు సినిమాల్లో నటించాడు. ఇటీవల ఆయన నటించిన మార్కో చిత్రం మలయాళంతో పాటు టాలీవుడ్‌లోనూ సూపర్‌ హిట్‌ అయింది. ఇక తాజాగా 'గెట్ సెట్ బేబీ' అనే మరో డిఫరెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఉన్ని ముకుందన్‌ మాట్లాడుతూ.. సినిమాల్లో ఇంటిమేట్‌ సీన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘నేను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే ముద్దు, రొమాంటిక్‌ సీన్లకు దూరంగా ఉండాలని కండీషన్‌ పెట్టుకున్నాను. ఇప్పటి వరకు నేను నటించిన సినిమాల్లో అలాంటి సన్నివేశాలు ఒక్కటి కూడా ఉండవు. అన్ని వర్గాల ప్రేక్షకులు కూర్చొని నా సినిమా చూడాలనుకుంటాను. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ముద్దు, ఇంటిమేట్‌ సీన్లలో నటించమని చాలా మంది దర్శకనిర్మాతలు నాపై ఒత్తిడి తెచ్చారు. ఇతర హీరోల సినిమాలను ఉదాహరణగా చూసిస్తూ..మీరు కూడా చెయ్యొచ్చు కదా అని అడిగారు.కానీ సున్నితంగా తిరస్కరించాను.  ఒక జంట మధ్య రొమాన్స్‌ చూపించాలనుకుంటే.. ముద్దులు పెట్టుకోవడం ఒక్కటే మార్గం కాదనేది నా భావన. నా తోటి హీరోలు అలాంటి సన్నివేశాల్లో నటించడాన్ని నేను ఏమాత్రం తప్పుపట్టను. నేను అలాంటి వాటిల్లో నటించను. ఇది నాకు నేనుగా పెట్టుకున్నా పాలసీ’ అని ఉన్ని ముకుందన్‌ చెప్పుకొచ్చాడు. 

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు