Breaking News

మోస్ట్‌ వయొలెంట్‌ చిత్రం.. సీక్వెల్‌ నుంచి తప్పుకున్న హీరో!

Published on Thu, 09/18/2025 - 16:46

మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్హీరోగా వచ్చిన మోస్ట్ వయోలెన్స్ చిత్రం మార్కో. గతేడాది రిలీజైన సినిమా మలయాళంలో సంచలనం సృష్టించింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. కేవలం మలయాళంలోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డులు సృష్టించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది.

మార్కో సూపర్ హిట్ కావడంతో మూవీకి సీక్వెల్తెరకెక్కించే పనిలో మేకర్స్ పుల్ బిజీ అయిపోయారు. తాజాగా లార్డ్ మార్కో టైటిల్ను మలయాళ ఫిల్మ్ ఛాంబర్లో అధికారికంగా నమోదు చేశారు. దర్శకుడు హనీఫ్, నిర్మాత షరీఫ్ టైటిల్ను రిజిస్టర్ చేసుకున్నారు. అయితే సినిమాలో మార్కో హీరో ఉన్ని ముకుందన్పేరు లేకపోవడం మాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఉన్ని ప్లేస్లో మరో హీరోను తీసుకొస్తున్నారా? అనే చర్చ మొదలైంది. దీంతో మూవీలో మమ్ముట్టి, యశ్, పృథ్వీరాజ్, హృతిక్ రోషన్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. లేదంటే మలయాళంలో ఎవరైనా స్టార్ హీరోతో ప్లాన్చేయనున్నారని టాక్.

అయితే ఇప్పటికే మార్కో సీక్వెల్నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఉన్ని ముకుందన్ ప్రకటించారు. మూవీపై విపరీతమైన నెగెటివిటీ రావడంతో ఆలోచనను విరమించుకుంటున్నట్లు తెలిపారు. మార్కో సిరీస్‌ను కొనసాగించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. మార్కో కంటే మంచి సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని వెల్లడింతారు. అందుకే ఉన్ని ముకుందన్ను సీక్వెల్నుంచి మేకర్స్ తప్పించినట్లు తెలుస్తోంది.

కాగా.. 2024 డిసెంబర్‌లో విడుదలైన ‘మార్కో చిత్రంలో వయొలెన్స్‌ విపరీతంగా ఉన్నట్లు టాక్ వినిపించింది. దీంతో కొందరు మార్కో చిత్రంపై విమర్శలు కూడా చేశారు. అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి విడుదల కాగా.. తెలుగు వెర్షన్ జనవరి 1న, తమిళ వెర్షన్ జనవరి 3న థియేటర్లలోకి వచ్చింది.

Videos

ఆనం వెనక్కి పో.. నిమ్మల ముందుకు రా వీడియో వైరల్..

YSR పై పాట ఇరగదీసిండు.. ఇది పక్కా ఊరోడి కథ

రష్మిక హెల్త్ ఎలా ఉంది? వదిన నన్ను ముద్దుగా ఏమని పిలుస్తాదంటే?

బాగానే గుండు కొట్టారు.. బ్యాంకింగ్ వ్యవస్థపై విజయ్ మాల్యా వైరల్ కామెంట్స్

ఫుట్ బాల్ కు మెస్సి గుడ్ బై ... ఎందుకో తెలుసుకోండి..!

నీటి విడుదల ప్రారంభమైందో లేదో.. వెలిగొండలో అపశ్రుతి..!

నేపాల్ లో హృదయ విదారకం.. తవ్వేకొద్దీ బయటపడుతున్న మృతదేహాలు

నేడు, రేపు పులివెందుల లో వైఎస్ జగన్ పర్యటన

'పదవుల కోసం కాదు'.. పవన్ మాటలపై సెటైర్లు!

మారికవలస గిరిజన హాస్టల్ వద్ద ఉద్రిక్తత... రాత్రంతా నిరసన..!

Photos

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

‘కూర్మావతార్‌’ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)