Breaking News

Unlocked Review: పోగొట్టుకున్న ఫోన్‌ సీరియల్‌ కిల్లర్‌కు దొరికితే!

Published on Sat, 08/24/2024 - 13:54

ఈ రోజుల్లో కాసేపు ఊపిరి బిగపట్టుకుని ఉండమన్నా ఉంటారేమో కానీ సెల్‌ఫోన్‌ లేకుండా క్షణం ఉండలేరు. ప్రతిదాంట్లో మంచి చెడు ఉన్నట్లే దీనివల్ల కూడా ఉపయోగం, ప్రమాదం.. అన్నీ ఉన్నాయి. మన ఫోన్‌ అవతలి వ్యక్తి చేతిలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్టే అన్‌లాక్‌డ్‌.

కథ
తింటున్నా, ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్తున్నా, షికారుకు వెళ్లినా, జర్నీ చేస్తున్నా, ఏం చేసినా సరే.. ప్రతీది సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంది నామీ. ఒకరోజు బస్‌లో తన ఫోన్‌ మర్చిపోతుంది. అది కాస్త సీరియల్‌ కిల్లర్‌కు దొరుకుతుంది. నిజానికి పాస్‌వర్డ్‌ తెలియకపోవడంతో అతడు ఏమీ చేయలేక కోపంతో ఫోన్‌ను పగలగొడతాడు. పొరపాటున ఫోన్‌ కిందపడి అద్దం పగిలిందని, బాగు చేసి ఇస్తానని అమ్మాయిని పిలుస్తాడు. ఆపై పాస్‌వర్డ్‌ చేప్పమని అడుగుతాడు. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది.

తన నిశ్శబ్ధమే..
ఈ క్రమంలో అక్కడికి వచ్చిన నామీ తటపటాయిస్తూనే తన పాస్‌వర్డ్‌ చెప్తుంది. దీంతో అతడు ఆమె ఫోన్‌ను హ్యాక్‌ చేసి ఇచ్చేస్తాడు. తన ప్రతి కదలికను గమనిస్తుంటాడు. నెమ్మది నెమ్మదిగా ఆమె జీవితాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని తనకు సంతోషమనేదే లేకుండా చేస్తాడు. అయితే ఇక్కడ సీరియల్‌ కిల్లర్‌ ఎక్కువ నిశ్శబ్ధంగా ఉండటం వల్ల నెక్స్ట్‌ ఏం చేస్తాడన్న ఉత్సుకత కలగక మానదు.

పాస్‌వర్డ్‌ అడగడమే విడ్డూరం
సినిమాలో క్యారెక్టర్ల గురించి పెద్దగా పరిచయం చేయకపోవడంతో చివర్లో కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. పెద్ద ట్విస్టులు లేకుండా కథ ఒకే లైన్‌లో ముందుకు సాగుతుంది. అయితే ఫోన్‌ స్క్రీన్‌ మార్చడానికి పాస్‌వర్డ్‌ అక్కర్లేదు. అలాగే షాపులోని వ్యక్తి (సీరియల్‌ కిల్లర్‌)కి పాస్‌వర్డ్‌ రాసివ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ ఇక్కడ షాపువాడు ఫోన్‌ పాస్‌వర్డ్‌ అడగడం, ఆమె రాసిచ్చేయడం కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

ఒక గంట 57 నిమిషాల నిడివి ఉన్న ఈ కొరియన్‌ థ్రిల్లర్‌ మూవీని ఓసారి చూసేయొచ్చు.  ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.

 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)