Breaking News

రేసులో అజిత్‌.. ఉదయనిధి స్టాలిన్‌ అభినందన

Published on Thu, 10/31/2024 - 06:46

కోలీవుడ్‌ సినీ నటుడు అజిత్‌ కుమార్‌కు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ అభినందనలు తెలియజేశారు. తమిళనాడు ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై చాటుతుండటాన్ని గుర్తు చేస్తూ కొనియాడారు. సినీ నటుడు అజిత్‌ కొత్త అవతారం ఎత్తారు. అజిత్‌కుమార్‌ రేసింగ్‌ టీం పేరిట టీమ్‌ లోగోను తాజాగా ఆవిష్కరించారు. సరికొత్త పాత్రలో రేసర్‌గా వస్తున్నట్టు అజిత్‌ ఆనందంగా ప్రకటించారు. 

రేసర్‌గా తన ప్రయాణంలో గెలవాలనే సంకల్పంతో ముందుకు సాగనున్నట్టు పేర్కొన్నారు. దుబాయ్‌లో త్వరలో జరగనున్న దుబాయ్‌ 24 హెచ్‌ 2025 పోటీలలో తొలిసారిగా అజిత్‌కుమార్‌ రేసింగ్‌ టీం పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. ఈ పోటీల ట్రయల్‌ రన్‌ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ఇందులో తమిళనాడు స్పోర్ట్స్‌ విభాగం లోగోను ధరించి ఈ ట్రయల్‌ రన్‌లో దూసుకెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. 

తమిళనాడు స్పోర్ట్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం నేతృత్వంలో క్రీడాభ్యున్నతికి జరుగుతున్న తోడ్పాటుకు మరింత బలం చేకూర్చే విధంగా అజిత్‌ ఆ లోగో ధరించడాన్ని ఉదయనిధి స్టాలిన్‌ ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికగా తమిళనాడు స్పోర్ట్స్‌ను చాటడం గర్వించ దగ్గ విషయం అని, ఇందుకు అభినందనలు తెలియజేశారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)