Breaking News

విజ‌య్‌ చివరి సినిమా జ‌న‌నాయ‌గ‌న్‌ కాదా? మాట నిలబెట్టుకుంటాడా?

Published on Tue, 01/06/2026 - 23:00

తమిళ స్టార్ హీరో విజ‌య్ తన కెరీర్ చివరి సినిమా జ‌న‌నాయ‌గ‌న్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రీమేక్‌గా వస్తున్న జ‌న‌నాయ‌గ‌న్ ఈ నెల 9న విడుదల కానుంది. ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజ‌య్, తన సినిమా ప్రయాణానికి ముగింపు పలికి ప్రజాసేవలో పూర్తిగా నిమగ్నం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజ‌య్ తన పార్టీ సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహిస్తూ రాజకీయ రంగంలో చురుకుగా ఉన్నాడు. ముఖ్యమంత్రి పదవినే లక్ష్యంగా పెట్టుకుని తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు. అయితే సినీ హీరోల రాజకీయ ప్రయాణం అంత సులభం కాదని గత అనుభవాలు చెబుతున్నాయి.  

గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో సినిమాలకు గుడ్‌బై చెప్పారు. కానీ ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ సంగతి సరేసరి. మొదట్లో ప్రజలే తనకు ముఖ్యమని, సినిమాలు తనకు ప్రాధాన్యం కాదని పలుమార్లు ప్రకటించారు. కానీ ఆ త‌ర్వాత మంచి డైరెక్ష‌న్ టీమ్ ఉండి ఉంటే త‌ను రాజ‌కీయాల్లోకే వ‌చ్చే వాన్ని కాద‌ని ప్ర‌క‌టించారు. ఇలా ప‌వ‌న్ ఎలాగైనా తన నాలుకను మ‌డ‌తేస్తూ ఉంటారు. ఇప్పుడు పొత్తులో ఆయ‌న‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ద‌క్కినా కూడా సినిమాలు మాత్రం ఆప‌డం లేదు. 

కమల్ హాసన్ పార్టీ స్థాపన సమయంలో సినిమాలకు విరామం ఇచ్చారు. తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. ఉపేంద్ర కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టినా, తిరిగి దర్శకుడిగా, నటుడిగా బిజీగా మారిపోయారు. విజ‌య్‌కాంత్ మంచి స్థితిలో ఉన్న కెరీర్‌ను వదిలి రాజకీయాల్లోకి వెళ్లారు. ఒక దశలో ప్రతిపక్ష నేతగా నిలిచినా, తర్వాత పార్టీ బలహీనమైపోయింది.  

విజ‌య్‌ రాజకీయాల్లో ఎంతవరకు విజయవంతం అవుతాడో చెప్పడం కష్టం. ముఖ్యమంత్రి పదవి దక్కకపోయినా, కనీస స్థాయిలో సీట్లు సాధించకపోయినా, ఆయన ప్రయాణం ఇతర స్టార్ హీరోల అనుభవాలకు భిన్నంగా ఉండకపోవచ్చు. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకున్న క్రేజ్, ప్రజల మద్దతు రాజకీయాల్లోకి మారడం అంత తేలిక కాదు. ఇండ‌స్ట్రీ బంగారు బాతు లాంటిది. అయినా ప‌ద‌వి లేకుండా రాజకీయ వేడి తట్టుకోవడం స్టార్ హీరోలకూ పెద్ద సవాలే మరి.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)