Breaking News

విషాదం.. అనుమానాస్పదస్థితిలో బుల్లితెర నటి ఆత్మహత్య

Published on Sun, 12/01/2024 - 19:10

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కన్నడ బుల్లితెర నటి ఆత్మహత్య చేసుకుంది. పలు కన్నడ సీరియల్స్‌లో నటించిన ఆమె సూసైడ్‌కు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం శోభిత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

(ఇది చదవండి: నాలుగు పెళ్లిళ్లు కాదు.. నాది రెండోపెళ్లి మాత్రమే.. నటుడు యూటర్న్‌)

కన్నడ సీరియల్స్‌లో నటిస్తోన్న శోభిత  తన భర్తతో కలిసి గచ్చిబౌలిలోని శ్రీరాంనగర్‌ కాలనీలో నివాసం ఉంటోంది. అయితే శోభిత మృతిపై కారణాలను ఆమె కుటుంబసభ్యులు వెల్లడించలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తన పెళ్లి తర్వాత సినిమాలకు, సీరియల్స్‌కు  శోభిత. దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శోభిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బ్రహ్మగంతు సీరియల్‌తో గుర్తింపు 

శాండల్‌వుడ్‌లో  బ్రహ్మగంతు సీరియల్ ద్వారా శోభిత శివన్న పాపులారిటీ తెచ్చుకుంది.  గతేడాది మే 22న పెళ్లి చేసుకున్న శోభిత ఆ తర్వాత బుల్లితెరకు దూరమైంది. అయితే తన పెళ్లి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు.

కర్ణాటకలోని సకలేష్‌పూర్‌కి చెందిన శోభిత మొదట్లో రాజ్‌ మ్యూజిక్‌ ఛానల్‌లో వీజేగా పనిచేసింది. ఆ తర్వాత మంచి ఆర్టిస్ట్‌గా సినిమాలతో పాటు బుల్లితెరపై తనదైన ముద్ర వేసింది. కన్నడ సీరియల్ బ్రహ్మగంతులో విలన్ పాత్రలో మెరిసిన శోభిత.. నీనిదలే అనే సీరియల్‌లో కూడా నటించింది. అంతేకాకుండా ఇతర భాషా సీరియల్స్‌లో కూడా కనిపించింది.  బుల్లితెరతో పాటు అటెంప్ట్ టు మర్డర్, జాక్‌పాట్ సినిమాల్లోనూ నటించింది. కన్నడలో శతభిషే అనే సినిమాలో కూడా కీలక పాత్ర పోషించింది. ఆమె మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు షాకింగ్‌కు గురయ్యారు.
 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)