Breaking News

భద్రకాళి కొత్త అనుభూతినిస్తుంది: తృప్తి రవీంద్ర, రియా జిత్తు

Published on Tue, 09/09/2025 - 03:47

‘‘తెలుగు ప్రేక్షకులు సినిమాలను గొప్పగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. అన్ని రకాల చిత్రాలను గొప్పగా ఆదరిస్తారు. వైవిధ్యమైన కథతో రూపొందిన మా ‘భద్రకాళి’ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిఇస్తుంది’’ అని హీరోయిన్లు తృప్తీ రవీంద్ర, రియా జిత్తు పేర్కొన్నారు. విజయ్‌ ఆంటోని నటించిన 25వ చిత్రం ‘భద్రకాళి’. అరుణ్‌ ప్రభు దర్శకత్వం వహించారు. మీరా విజయ్‌ ఆంటోని సమర్పణలో విజయ్‌ ఆంటోని ఫిల్మ్‌ కార్పొరేషన్, సర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్  బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న రిలీజ్‌  కానుంది.

ఈ సందర్భంగా తృప్తి రవీంద్ర మాట్లాడుతూ–‘‘మాది మహారాష్ట్ర. సినిమాలపై ఆసక్తితో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేశాను. నా తొలి ఫీచర్‌ ఫిలిం ‘భద్రకాళి’. విజయ్‌గారితో నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్  ఇచ్చింది. మీరా, రామాంజనేయులుగార్లు చాలా సపోర్ట్‌ చేశారు’’ అన్నారు. రియా జిత్తు మాట్లాడుతూ– ‘‘మలయాళి అయిన నేను మలయాళ, తమిళ సినిమాలు చూస్తూ పెరిగాను. దాదాపు 15 సినిమాల్లో బాలనటిగా చేశాను. కొంచెం బ్రేక్‌ తీసుకుని, చదువు పూర్తయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ‘భద్రకాళి’ లాంటి కథ సమాజానికి చాలా అవసరం. ఈ సినిమా అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది’’ అన్నారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)