Breaking News

పెళ్లిపీటలెక్కిన ట్రాన్స్ జెండర్ హీరోయిన్.. :ఫోటోలు వైరల్‌

Published on Sun, 03/05/2023 - 14:51

సోసైటీలో అన్ని రంగాల్లో లేడీస్....జెంట్స్ తో సమానంగా ట్రాన్స్ జెండర్స్  కూడా రాణిస్తున్నారు. ఇన్ సెక్యూరిటీతో నలుగురిలోకి రాకుండా ఆగిపోవటం లేదు. తమకి నచ్చిన రంగంలో రాణించేందుకు కృషి చేస్తున్నారు. అలా ధాయ్ లాండ్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ట్రాన్స్ జెండర్ పోయిడ్ ట్రిచాడ స్టార్‌ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకుంది.  36 ఏళ్ల ట్రిచాడ హీరోయిన్ గా సినిమాల్లో నటిస్తూనే మోడలింగ్ రంగంలో కూడా మంచి గుర్తింపు పొందారు. తాజాగా ఈ బ్యూటీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. పుకెట్ ప్రావిన్స్ కు చెందిన బడా బిజినెస్ మ్యాన్ ఓక్ భవఘా హాంగ్యోక్ తో  మార్చి 1 పోయిడ్‌ ట్రిచాడ పెళ్లి జరిగింది.  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పోయిడ్ తన మ్యారేజ్ పోటోస్ షేర్ చేసింది. అంతేకాదు ఇప్పుడు మేమిద్దరం అఫిషియల్ గా భార్య భర్తలం అంటూ పోయిడ్ తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ పెట్టింది.  నెట్టింట ఈ పోస్ట్ తో పాటు.. ఈజంట పోటోలు వైరల్ గా మారాయి. 

ట్రిచాడ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈమె ఇన్‌ స్టాలో దాదాపు 26లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నిజానికి ట్రిచాడ పుట్టుకతోనే అబ్బాయిగా జన్మించింది...థాయ్ లాండ్ లోని ఫెంగ్ నాలో 1986 అక్టోబర్ 5న జన్మించిన పోయిడ్ ట్రిచాడ పెరిగే కొద్ది తనలో అమ్మాయిల లక్షణాలు ఉన్నాయని గుర్తించాడు. పదిహేడేళ్ల వయస్సు వచ్చే వరకు అబ్బాయిగా జీవించినా... ఆ తర్వాత ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ తో అమ్మాయిగా మారిపోయింది. ఆ తర్వాత పోయిడ్ తనకి నచ్చిన మోడలింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేసింది. 

అలాగే 2004లో ట్రాన్స్ జెండర్స్  కోసం నిర్వహించే  మిస్ టిఫ్ఫనీ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది.. అదే సంవత్సరం మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ కీరిటం కూడా దక్కించుకుంది. మోడలింగ్ ఫీల్డ్ లో మంచి పాపులారిటీ తోపాటు క్రేజ్ తెచ్చుకున్న ఈ ట్రాన్స్ జెండర్ బ్యూటీకి  థాయ్‌ లాండ్ లోని సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. 2010 లో విత్ లవ్ మూవీతో పోయిడ్‌ తెరంగ్రేటం చేసింది.  ఈ సినిమా తర్వాత స్పైసీ బ్యూటీ క్వీన్ ఆఫ్‌ బ్యాంకాక్ 2 లో నటించి ప్రశంసలు అందుకుంది. పోయిడ్ హాంకాంగ్ మూవీస్ ది వైట్ స్టామ్..ఫ్రమ్ వెగాస్ టు మకాన్...విచ్ డాక్టర్ లో నటించింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)