Breaking News

హాలీవుడ్‌లో విషాదం.. ‘బాట్‌మ్యాన్’ ఇక లేరు!

Published on Wed, 04/02/2025 - 11:57

హాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. టాప్ గన్, బ్యాట్‌మ్యాన్ ఫరెవర్ లాంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో యావత్‌ సినీ ప్రపంచాన్ని అలరించిన హాలీవుడ్‌ హీరో వాల్‌ కిల్మర్‌ (Val Kilmer)(65) కన్నుమూశారు. గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్‌ 1న లాస్‌ ఏంజిల్స్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1980, 90 ద‌శ‌కాల్లో త‌న న‌ట‌న‌తో కిల్మ‌ర్ అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నాడు. 

1986లో రిలీజైన టాప్ గన్ చిత్రం వాల్‌ కిల్మర్‌కి మంచి నటుడుగా గుర్తింపు తెచ్చిపెట్టింది. తన కెరీర్‌లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 'టాప్ గన్'లో ఐస్‌మ్యాన్, 'బాట్‌మన్ ఫరెవర్'లో బాట్‌మ్యాన్, 'ది డోర్స్'లో జిమ్ మారిసన్ వంటి పాత్రలు ఆయనకు విశేష గుర్తింపు తెచ్చాయి. టోంబ్‌స్టోన్‌(1993), ట్రూ రొమాన్స్‌(1993), హీట్‌(1995), ద గోస్ట్ అండ్ ద డార్క్‌నెస్‌(1996) చిత్రాల్లోనూ కిల్మ‌ర్ న‌టించాడు. అతను నటించిన చివరి చిత్రం టాప్‌ గన్‌ మావరిక్‌ 2022లో రిలీజై మంచి విజయం సాధించింది.ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్ లాంటి యానిమేష‌న్ చిత్రాల‌కు అత‌ను వాయిస్ ఓవ‌ర్ ఇచ్చాడు.

కిల్మర్‌ వ్యక్తిగత విషయాలకొస్తే....అతని పూర్తి పేరు వాల్ ఎడ్వర్డ్ కిల్మర్. లాస్ ఏంజిల్స్‌లో డిసెంబర్‌ 31, 1959లో జన్మించాడు. చాట్స్‌వ‌ర్త్‌లో అత‌ని బాల్యం గ‌డిచింది. 1988లో తోటి నటి జోవాన్ వాలీతో ప్రేమ వివాహం జరిగింది. వీరికి కూతురు మెర్సిడీస్‌, కుమారుడు జాక్ ఉన్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 1996లో విడాకులు తీసుకున్నారు. 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)