Breaking News

దిల్‌ రాజు ఇంట పెళ్లి వేడుక.. జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం!

Published on Wed, 01/31/2024 - 16:46

ఇటీవల ఎక్కువగా సినీతారల పెళ్లి వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. కొత్త ఏడాదిలోనూ సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల హడావుడి మొదలైంది.గతేడాది సైతం పలువురు టాలీవుడ్ ప్రముఖులు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. 2023లో పెళ్లి చేసుకున్న వారిలో మంచుమనోజ్, వరుణ్ తేజ్ లాంటి స్టార్ హీరోలు ఉన్నారు. తాజాగా మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అయిపోయారు. తన పెళ్లికి రావాలంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిసి వివాహా ఆహ్వాన పత్రికను అందించారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకుందామా?

ఆ యంగ్ హీరో మరెవరో కాదు.. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్‌ రాజు మేనల్లుడే. తాజాగా నిర్మాత దిల్‌రాజుతో కలిసి జూనియర్‌ ఎన్టీఆర్‌ను పెళ్లికి ఆహ్వానించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వచ్చే నెలలోనే ఆశిష్ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా.. దిల్ రాజు మేనల్లుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డితో ఆతనికి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.  ఇరు కుటుంబ సభ్యుల, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.

కాగా.. ఆశిష్ ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. అంతకుముందే 2022లో రౌడీ బాయ్స్‌ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది. జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)