Breaking News

గులాబీ మాటల రచయిత నరసింగరావు కన్నుమూత

Published on Thu, 08/29/2024 - 06:15

సీనియర్‌ రచయిత నడిమింటి నరసింగరావు (72) ఇక లేరు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘గులాబీ’, రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలోని ‘అనగనగా ఒకరోజు’ వంటి సూపర్‌ హిట్‌ ఫిల్మ్స్‌తో పాటు ‘పాత బస్తీ, ఊరికి మొనగాడు, కుచ్చికుచ్చి కూనమ్మా’ ... ఇలా దాదాపు యాభై సినిమాలకు నరసింగరావు మాటల రచయితగా చేశారు. 

సినిమాల్లోకి రాకముందు తెలుగు నాటకరంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ‘బొమ్మలాట, రైలుబండి’ వంటి నాటకాలు రాశారు. అలాగే ‘తెనాలి రామకృష్ణ, అంతరంగాలు, లేడీ డిటెక్టివ్, వండర్‌ బాయ్‌’ ఇలా దాదాపు యాభై సీరియల్స్‌కు ఆయన మాటలు రాశారు. రచయితగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు, సన్మానాలు ఎన్నో అందుకున్నారు. కాగా ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించాలనుకున్న చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌లో పాలుపంచుకున్నారు. నరసింగరావుకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన మృతికి తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణతో పాటు పలువురు చిత్రరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)