Breaking News

మూడు వెబ్‌ సిరీస్‌లకు శ్రీకారం

Published on Thu, 02/29/2024 - 04:37

‘ఎన్‌కౌంటర్, శ్రీరాములయ్య, జయం మనదేరా, ఆయుధం, భద్రాచలం, జై బోలో తెలంగాణ’ వంటి హిట్‌ చిత్రాల దర్శకుడు ఎన్ . శంకర్‌ చారిత్రాత్మక కథాంశాలతో మూడు వెబ్‌ సిరీస్‌లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్ . శంకర్‌ టీవీ అండ్‌  ఫిల్మ్‌ స్టూడియో బ్యానర్‌లో ఆయన నిర్మాతగా, దర్శకత్వ పర్యవేక్షణలో ఈ వెబ్‌ సిరీస్‌లు రూ΄÷ందనున్నాయి. ఈ సందర్భంగా ఎన్ . శంకర్‌ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ సాయిధ ΄ోరాటం నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు మొదటి వెబ్‌ సిరీస్‌ నిర్మించనున్నాను. అక్టోబర్‌లో చిత్రీకరణ మొదలవుతుంది.

అలాగే మహాత్మ జ్యోతీరావు ఫూలేగారి స్ఫూర్తితో రెండో వెబ్‌ సిరీస్‌ నిర్మిస్తాను. అయితే ఇది ఆయన బయోగ్రఫీ కాదు. జ్యోతీరావు ఫూలేగారి అనుభవాలు, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, సంఘర్షణలు వంటివి ఈ వెబ్‌ సిరీస్‌లో ఉంటాయి. అదే విధంగా బాబా సాహెబ్‌ అంబేద్కర్‌గారిపై మూడో వెబ్‌ సిరీస్‌ ఉంటుంది. అయితే ఇది ఆయన బయోగ్రఫీ కాదు. అంబేద్కర్‌గారు ఇచ్చిన గొప్ప రాజ్యాంగ స్ఫూర్తిని, వ్యక్తి నుండి వ్యవస్థగా మారడానికి మధ్య జరిగిన సంఘర్షణల ఇతివృత్తంగా ఈ సిరీస్‌ సాగుతుంది. ఈ మూడు వెబ్‌ సిరీస్‌లను తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తాం. పూర్తి వివరాలు త్వరలో చెబుతాను’’ అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)