Breaking News

నిర్మాత మహేశ్‌ కన్నుమూత 

Published on Mon, 02/26/2024 - 02:16

ప్రముఖ సినీ, టీవీ నిర్మాత, రచయిత వి.మహేశ్‌  (85) శనివారం రాత్రి చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. స్వగృహంలో బాత్‌ రూమ్‌ నుంచి బయటికి వస్తూ కాలుజారి పడిన మహేశ్‌ని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నెల్లూరు జిల్లా కొరుటూరు వి.మహేశ్‌ స్వస్థలం. ‘మాతృమూర్తి’ సినిమాతో  సినిమా నిర్మాణంలోకి ప్రవేశించారు మహేశ్‌.

ఎన్టీ రామారావు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘మనుషులంతా ఒక్కటే’, లక్ష్మి దీపక్‌ దర్శకత్వంలో ‘మహాపురుషుడు’, చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్వకత్వంలో ‘సింహపురి సింహం’, బోయిన సుబ్బారావు దర్శకత్వంలో సుమన్, భానుప్రియ జంటగా ‘ముసుగు దొంగ’ వంటి పలు సినిమాలు నిర్మించారాయన. ‘మనుషులంతా ఒక్కటే’ చిత్రానికి ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును అందుకున్నారు వి.మహేశ్‌. శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్‌లో ప్రసారమైన ‘హరి భక్తుల కథలు’ సీరియల్‌కి ఆయన నిర్మాతగా, రచయితగా వ్యవహరించారు.

అలాగే ‘విప్రనారాయణ’కు 2009లో ఉత్తమ టెలీ ఫిలింగా బంగారు నందితో పాటు, మరో మూడు విభాగాల్లో నంది పురస్కారాలు అందుకున్నారాయన. తన అన్నయ్య, ప్రముఖ కళా దర్శకుడు వి. వి. రాజేంద్ర కుమార్‌తో కలసి సినిమాలకు ప్రచార సామగ్రిని తయారు చేసేందుకు ‘స్టూడియో రూప్‌ కళ’ అనే సంస్థను, ‘ఆదిత్య చిత్ర ’ నిర్మాణ సంస్థను నెలకొల్పారు వి. మహేశ్‌. అయితే ఆయన వివాహం చేసుకోలేదు. వి.మహేశ్‌ మృతికి సినిమా, టెలివిజన్‌ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)