Breaking News

ప్రభాస్‌కి చాలా సిగ్గు.. టికెట్‌ కొనిచ్చి థియేటర్‌కి పంపాడు: హంసనందిని

Published on Tue, 07/02/2024 - 16:06

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ రియల్‌ లైఫ్‌కి, రీల్‌ లైఫ్‌కి చాలా తేడా ఉంటుంది. సినిమాల్లో చాలా చలాకీగా ఉంటూ..ఎలాంటి పాత్రనైనా తనదైన నటనతో ఆకట్టుకుంటాడు. కానీ రియల్‌ లైఫ్‌లో మాత్రం ఇంట్రోవర్ట్‌. ఎక్కువగా మాట్లాడడు. స్టైజ్‌పై మాట్లాడమంటే సిగ్గుపడుతుంటాడు. అంతేకాదు ఇతరులతో మాటలు కలిపేందుకు కూడా వెనుక ముందు ఆలోచిస్తుంటాడు. తనకు క్లోజ్‌ అయిన వారితో సరదాగే ఉన్నా..కొత్త వారితో మింగిల్‌ అయ్యేందుకు చాలా సమయం తీసుకుంటాడని ప్రభాస్‌ సన్నిహితులు చెబుతుంటారు. ఒక్కసారి తనతో స్నేహం ఏర్పడితే.. వారిని తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటాడట. ఇక షూటింగ్‌ టైమ్‌లో అందరికి భోజనాలు తెప్పించే అలవాటు డార్లింగ్‌కి ముందు నుంచే ఉంది.

(చదవండి: బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న కల్కి.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే?)

తాజాగా టాలీవుడ్‌ హీరోయిన్‌ హంసనందిని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ‘మిర్చి’ సినిమాలో టైటిల్‌ సాంగ్‌కి ప్రభాస్‌తో కలిసి స్టెప్పులేసింది ఈ బ్యూటీ. అయితే వేరే సినిమా షూటింగ్‌ కారణంగా ఆ సినిమా తాను చూడలేకపోయానని.. ఈ విషయం తెలిసి ప్రభాసే టికెట్‌ బుక్‌ చేసి సినిమా చూపించారని హంసనందిని చెప్పింది.

(చదవండి: నాగ్‌ అశ్విన్‌.. మీ చెప్పులిస్తే ముద్దు పెట్టుకుంటా: బ్రహ్మాజీ)

‘ప్రభాస్‌కి చాలా సిగ్గు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. మిర్చి సినిమా షూటింగ్‌ అయిపోయిన తర్వాత నేను వేరే సినిమాలో బిజీ అయ్యాడు. ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌ని అందుబాటులో లేను. అలాగే రిలీజ్‌ టైమ్‌లో కూడా నేను హైదరాబాద్‌కి రాలేదు. కొద్ది రోజుల తర్వాత వేరే సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చాను. ఓ పార్టీలో ప్రభాస్‌ కలిసి.. ‘నీ సాంగ్‌ పెద్ద హిట్‌ అయిందని నీకు తెలుసా?’అని అడిగాడు. నేను సినిమా చూడలేదని చెప్పాను. వెంటనే టికెట్‌ బుక్‌ చేసి సినిమా చూడమని చెప్పాడు. అంతేకాదు సినిమాలో నా సాంగ్‌ ఏ టైమ్‌కి వస్తుందో కూడా చెప్పాడు. నేను అదే టైమ్‌కి థియేటర్‌కి వెళ్లి సినిమా చూశాను’ అని హంసనందిని చెప్పుకొచ్చింది.  ప్రభాస్‌ హీరోగా నటించిన కల్కి 2898 మూవీ  తాజాగా రిలీజై బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను సృష్టిస్తోంది.  విడుదలైన ఐదు రోజుల్లో 625 ​కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)