Breaking News

టాలీవుడ్ హీరో శాండల్‌వుడ్ ఎంట్రీ.. పునీత్‌ రాజ్‌కుమార్‌కు నివాళులు..!

Published on Fri, 12/26/2025 - 07:47

టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర ఎటువంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినీరంగంలో సత్తా చాటుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా థ్రిల్లర్‌ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ ఏడాదిలో పలు సినిమాలతో మెప్పించిన నవీన్ చంద్ర.. శాండల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశాడు.

ఈ సందర్భంగా దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌ కుమార్‌ సమాధిని సందర్శించారు. ఆయనకు మొకాళ్లపై కూర్చుని నివాళులర్పించారు. కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాకు మీ ఆశీర్వాదాలు కావాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.  కాగా.. కన్నడ సినీ ఇండస్ట్రీలో నవీనచంద్ర నటించిన తొలి సినిమా మార్క్. కిచ్చా సుదీప్ హీరోగా వచ్చిన ఈ యాక్షన్‌ మూవీ క్రిస్‌మస్‌ కానుకగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించారు. రిలీజ్‌కు ముందు వచ్చిన పోస్టర్స్‌ చూస్తే పవర్‌ఫుల్ రోల్ చేసినట్లు తెలుస్తోంది. 
 

 

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)