Breaking News

'మదర్‌ ఇండియా'కు సిద్ధం..

Published on Tue, 07/09/2024 - 12:40

తమిళసినిమా: నటుడు, దర్శకుడు శశికుమార్‌కు మళ్లీ హీరోగా అవకాశాలు వరుస కడుతున్నాయి. అయోథి చిత్ర విజయంతో ఈయనకు మంచి టైమ్‌ వచ్చిందనే చెప్పాలి. సూరి కథానాయకుడిగా నటించిన గరుడన్‌ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించి ఆ చిత్ర విజయంలో శశికుమార్‌ భాగం అయ్యారు. తాజాగా మరో చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దీనికి రాజు మురుగన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈయన ఇంతకు ముందు కూక్కూ, జోకర్, జిప్సీ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఇటీవల కార్తీ హీరోగా రాజు మురుగన్‌ దర్శకత్వం వహించిన జపాన్‌ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో ఈయనకిప్పుడు నటుడు శశికుమార్‌ చేయూత నిచ్చారు. వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఒలింపియా మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది.

ఈ సంస్థ ఇంతకు ముందు డాడా వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రానికి మందర్‌ ఇండియా అనే టైటిల్‌ను ఖారారు చేసినట్లు తెలిసింది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే  ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్‌గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం ద్వారా కన్నడ నటి చైత్రా జె.అచ్చర్‌ కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.

ఈమె ఇటీవల కన్నడంలో నటించిన సప్త సాగరదాచే ఎల్లో సైడ్‌ ఏ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి శ్యాన్‌ రోల్డన్‌ సంగీతాన్ని  అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా నటుడు శరత్‌కుమార్‌ మరోవైపు స్వీయ దర్శకత్వంలో కుట్ర పరంపరై అనే వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి చదవండి: ఆవిడ బయోపిక్‌లో నటించాలని..!

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)