Breaking News

రాజమౌళి- మహేశ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా..?

Published on Fri, 02/16/2024 - 15:26

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB29 మరొకొద్ది రోజుల్లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన కీలక వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ. కొన్ని సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. మహేష్ బాబును కొత్త అవతార్‌లో చూడాలని అభిమానులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్లు తన పాత్ర కోసం కఠినమైన శిక్షణను మహేశ్‌ పొందుతున్నాడు.

ఈ చిత్రం కోసం హాలీవుడ్‌ నటీనటులను రాజమౌళి తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇండోనేషియా నటి అయిన చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్‌తో పాటు  థోర్‌ సినిమాతో పాపులర్‌ అయిన క్రిస్ హెమ్స్‌వర్త్‌ SSMB29 ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా  మహేశ్‌ -రాజమౌళి సినిమాకు టైటిల్‌ ఫిక్స్‌ అయిందని వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'మహారాజా' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్‌ అవుతుంది. అంతేకాకుండా ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌ను SSRMB అని రాజమౌళి సెట్‌ చేశారట. ఇలా మహేశ్‌ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లకుండానే  అనేక రూమర్స్‌తో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండటం విశేషం.

SSMB29 రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ లాక్ చేయబడిందని ఈ ఏడాదిలో షూటింగ్‌ ప్రారంభం అవుతుందని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్‌గా తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేశ్‌ బాబు చాలా కష్టపడ్డాడు. జంగిల్ అడ్వెంచర్ ఫిలిం కావడంతో ఈ సినిమాను ఆఫ్రికా అడవుల్లో కూడా చిత్రీకరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం ఆయన రెమ్యునరేషన్‌ తీసుకోకుండా ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉండబోతున్నారని సమాచారం.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)