Breaking News

కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉన్నాను

Published on Thu, 01/01/2026 - 04:02

ఏఐ టెక్నాలజీని బాధ్యతాయుతంగా వినియోగించాలని, తోటివారి గౌరవానికి భంగం కలిగేలా ఉపయోగించడం మంచి విధానం కాదని చెబుతున్నారు హీరోయిన్‌ టీనా శ్రావ్య. హిట్‌ ఫిల్మ్‌ ‘కమిటీ కుర్రోళ్ళు’ (2024)తో వెండితెరపై కనిపించిన ఈ తెలుగమ్మాయి, ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్‌ ఫిల్మ్‌ ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’లో హీరోయిన్‌గా యాక్ట్‌ చేశారు. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా టీనా పంచుకున్న విశేషాలు..

→ కొత్త సంవత్సరం (2026) నాకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉండబోతుందని ఆశిస్తున్నాను. విభిన్నమైన పాత్రలు చేసేందుకు నటిగా కొత్త సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను చేసే ప్రతి సినిమాలో ఓ కొత్త తరహా పాత్రతో ఓ యాక్టర్‌గా ఆడియన్స్  ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. 

→ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ప్రతి సంవత్సరం నేను కొత్త గోల్స్‌ను సెట్‌ చేసుకుంటూనే ఉంటాను. నా గోల్స్‌ పట్ల చాలా క్లియర్‌గా ఉంటాను. ఇందుకోసం రాజీ లేకుండా కష్టపడతాను. అదే సమయంలో నా ఆరోగ్యం గురించి కూడా సరైన జాగ్రత్తలు పాటిస్తాను. ఇంకా కొత్త తరహా నైపుణ్యాలను నేర్చుకోవాలనుకుంటున్నాను. 

→ నిరంతరం కష్టపడుతూ ఉండటం, ఒదిగి ఉండటం వంటి లక్షణాలను నేను మరింతగా పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నాను. నిజాయితీగా ఉండటం, ఓర్పుతో నేర్పుగా మెలగడం ఈ ఇండస్ట్రీలో చాలా కీలకమని గ్రహించాను. ఇతర భాషలను నేర్చుకోవాలనుకుంటున్నాను. భవిష్యత్‌లో నేను పోషించే ప్రతి పాత్ర తాలూకు స్వభావాన్ని లోతుగా ఎలా అధ్యయనం చేయగలననే విషయాల్లో మరింత మెరుగవ్వాలనుకుంటున్నాను. అప్పుడే ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేయగలనని భావిస్తున్నాను. 

→ ఏఐ టెక్నాలజీని బాధ్యతాయుతంగా, నైతికంగా ఉపయోగించాలి. తోటివారి గోప్యత, గౌరవానికి భంగం కలిగేలా వినియోగించకూడదు. ఫేక్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ, వారిని ఇబ్బంది పెట్టకూడదు. మరీ ముఖ్యంగా ఈ తరహా దుర్వినియోగం నుంచి మహిళలను రక్షించేందుకు కఠినమైన చట్టాలు ఉండాలని నేను గట్టిగా నమ్ముతున్నాను. నా కొత్త సినిమాలను గురించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాను.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)