Breaking News

Tillu Square: అనుపమతో డీజే టిల్లు ఫ్లర్టింగ్‌.. ప్రోమో అదిరింది!

Published on Tue, 07/25/2023 - 12:16

 ‘డీజే టిల్లు’.. ఈ ఒక్క మూవీతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా సిద్దుకు తగిన గుర్తుంపు రాలేదు. కానీ డీజే టిల్లు మాత్రం అతని జీవితాన్ని మార్చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ మల్లిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సీక్వెల్‌కు టిల్లు స్క్వేర్‌ అని టైటిల్‌ ఫిక్స్‌ చేశారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్​డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. సినిమాలోని 'టికెటే కొనకుండా' అనే పాటను జులై 26న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రోమోని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. అందులో సిద్ధు తనదైన స్టైల్లో అనుపమను ఫ్లర్టింగ్‌ చేశాడు.

ఓ పార్టీలో వాష్‌ బేసిన్‌ వద్ద షూస్‌ క్లీన్‌ చేస్తున్న సిద్ధు.. అక్కడే ఉన్న అనుపమను చూస్తూ.. ‘మనసు విరిగినట్టున్నది ఎక్కడనో’అనడంతో ఆమె కోపంగా చూస్తుంది. ఉన్నడా బాయ్‌ఫ్రెండ్‌? అనడంతో.. ‘నీకెందుకు’ అంటుంది అను. అప్పుడు సిద్దు..‘ఒకవేళ ఉంటే నా షూ నేనేసుకుని వెళ్లిపోతా,  లేడంటే.. ‘నిన్నేసుకొని పోతా’అంటాడు. ‘అబా.. ఎక్కడికి?’అని అను అంటే..‘నువ్వు ఏడికంటే ఆడికి’అని సిద్ధు రిప్లై ఇస్తాడు. ‘ఇప్పుడే కదరా కలిశాం. అప్పుడే ఓపెన్‌గా ఫ్లర్ట్ చేస్తావా’ అంటుంది అనుపమ. ‘మరి ఫ్లర్ట్ చేస్తున్న సంగతి నీకు తెల్వాలే గదా. లేకపోతే చేసి ఉపయోగం ఏముంది?’ అంటూ ఫన్నీగా ఆ ప్రోమో సాగుతుంది. ప్రోమోని ఇంత కామెడీగా ఉంది అంటే.. ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అని ఫ్యాన్స్‌ అంచనాలు పెంచేసుకుంటున్నారు. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)