మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం
Breaking News
'థగ్ లైఫ్' ఈవెంట్ వాయిదా.. ఇది వేడుకల సమయం కాదు: కమల్
Published on Fri, 05/09/2025 - 13:38
కమల్ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్’. మే 16న ఈ సినిమా ఆడియో వేడుక చెన్నైలో జరగాల్సి ఉంది. అయితే, భారత్-పాకిస్థాన్ (India-Pakistan) ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. ఇలాంటి సమయంలో భారత పౌరలకు ఇబ్బంది కలిగించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
'ఆర్ట్ కెన్ వెయిట్.. ఇండియా కమ్స్ ఫస్ట్' అనే శీర్షికతో కమల్ హాసన్ ఒక ప్రకటన విడుదల చేశారు. 'మన దేశ సరిహద్దులో జరుగుతున్న పరిణామాలు, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మే 16న జరగాల్సిన 'థగ్ లైఫ్' ఆడియో విడుదలను వాయిదా వేస్తున్నాం. తిరిగి షెడ్యూల్ వివరాలను తెలుపుతాము. మన సైనికులు మన మాతృభూమి రక్షణలో అచంచలమైన ధైర్యంతో ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్నారు. ఇది నిశ్శబ్ద సంఘీభావం కోసం నిర్ణయం తీసుకున్నాం. వేడుకలకు ఇదీ సరైన సమయం కాదని నేను నమ్ముతున్నాను. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాం' అని ఆయన పంచుకున్నారు.
‘నాయగన్’ (1987) వంటి హిట్ మూవీ తర్వాత 38 సంవత్సరాలకు మళ్లీ కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్లో ‘థగ్ లైఫ్’ సినిమా వస్తుంది. శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్యా లక్ష్మి, జోజు జార్జ్, అభిరామి, నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతదర్శకుడిగా, రవి కె. చంద్రన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
Statement from Kamal Haasan#Thuglife #ThuglifeFromJune5 #KamalHaasan #SilambarasanTR @ikamalhaasan #ManiRatnam @arrahman @SilambarasanTR_ #Mahendran @bagapath @trishtrashers @AishuL_ @AshokSelvan @abhiramiact @C_I_N_E_M_A_A #Nasser @manjrekarmahesh @TanikellaBharni… pic.twitter.com/jkMiXDBNG0
— Raaj Kamal Films International (@RKFI) May 9, 2025
Tags : 1