Breaking News

శంకర్‌ దర్శకత్వంలో 3 భారీ చిత్రాలు

Published on Wed, 07/03/2024 - 11:28

దర్శకుడు శంకర్‌ అంటే బ్రహ్మాండం . బ్రహ్మాండ మంటే శంకర్‌ అనేలా ఆయన చిత్రాలు ఉంటాయి. ఈయన చిత్రా లు నిర్మించడంలో లేట్‌ అయినా, చిత్రాలు మాత్రం లేటెస్ట్‌గా ఉంటాయి. కాగా 1996లో నటుడు కమలహాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వం వహించిన ఇండియన్‌ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.

 కాగా సుమారు 28 ఏళ్ల తర్వాత అదే కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ఇండియన్‌– 2. లైకా ప్రొడక్షన్స్, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఇండియన్‌ – 2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ చిత్రం ప్రమోషన్‌లో బిజీ బిజీగా ఉన్న దర్శకుడు శంకర్‌ ఒక భేటీలో తన తదుపరి చిత్రాల గురించి పేర్కొన్నారు. తదుపరి 3 భారీ కథా చిత్రాలను చేయబోతున్నట్లు చెప్పారు. 

అందులో ఒకటి చారిత్రాత్మక కథాంశంతో ఉంటుందని, మరొకటి జేమ్స్‌బాండ్‌ తరహాలో సాగే కథా చిత్రం అని, ఇక మూడోది స్పై కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఈ మూడు చిత్రాలు భారీ బడ్జెట్లో బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పారు. వీటికి ప్రపంచంలోనే ఆధునిక వీఎఫ్‌ఎక్స్‌ టెక్నాలజీతో రూపొందించ తలపెట్టినట్లు దర్శకుడు శంకర్‌ తెలిపారు. కాగా ఇండియన్‌ –3 చిత్రం షూటింగ్‌ కూడా పూర్తి కావడంతో మరో ఆరు నెలలు ఈ చిత్రం కూడా విడుదల అవుతుందని చెప్పారు. ఇక తాను తెలుగులో రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా రూపొందిస్తున్న గేమ్‌ చేంజర్‌ చిత్రం షూటింగ్‌ మరో 15, 20 రోజుల్లో పూర్తి అవుతుందని ఆయన చెప్పారు.  

#

Tags : 1

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)