Breaking News

హీరో విశ్వక్సేన్‌ ఇంట్లో చోరీ నిందితుల అరెస్టు

Published on Thu, 03/20/2025 - 10:02

ఫిలింనగర్‌: సినీ హీరో విశ్వక్సేన్‌ ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను ఫిలింనగర్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్‌ రోడ్డునంబర్‌–8లో సినీ హీరో విశ్వక్సేన్‌ నివసిస్తున్నాడు. ఈనెల 14న తెల్లవారుజామున దుండగులు అతని ఇంటి తాళాలు పగులగొట్టి వజ్రాభరణాలతో పాటు హెడ్‌ఫోన్‌ ఎత్తుకెళ్లారు. దీంతో అదేరోజు విశ్వక్సేన్‌ తండ్రి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

రంగంలోకి దిగిన ఎస్‌ఐ సతీశ్‌కుమార్, కానిస్టేబుళ్లు సురేందర్‌ రాథోడ్, ఇంతియాజ్‌ హుస్సేన్‌ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి సీసీ కెమెరాలను పరిశీలించారు. 4 రోజుల పాటు సుమారుగా 200లకు పైగా సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించారు. బేగంపేట మయూరిమార్గ్‌లో అద్దెకు ఉంటున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ కేసు వీడింది. కొత్తగూడెంకు చెందిన భీమవరపు స్వరాజ్‌ (21), బొల్లి కార్తీక్‌ (22), నేరేడుమల్లి సందీప్‌ (21) ఫుడ్‌ డెలివరీబాయిస్‌గా పనిచేస్తూ జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీపై దృష్టిపెట్టారు.

 సినీ హీరో విశ్వక్సేన్‌ ఇంటి వద్ద వారం పాటు రెక్కీ నిర్వహించి ఆయన కుటుంబ సభ్యుల కదలికలపై దృష్టి పెట్టారు. ముగ్గురూ కలిసి ఒకే బైక్‌పై విశ్వక్సేన్‌ ఇంటికి చేరుకుని కొద్ది దూరంలో బైక్‌ ఆపారు. స్వరాజ్‌ ఇంటి తాళాలు పగులగొట్టి డైమండ్‌ రింగ్‌లతో పాటు హెడ్‌ఫోన్‌ చోరీ చేసి బయటకు రాగానే ముగ్గురు కలిసి బైక్‌పై ఉడాయించారు. వీరిని అరెస్టు చేసి డైమండ్‌ రింగ్‌లతో పాటు 3 మొబైల్‌ ఫోన్లు, ఒక ఎలక్ట్రిక్‌ బైక్‌ను స్వా«దీనం చేసుకుని ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. 

విశ్వక్సేన్‌ సోదరి ఇంట్లో భారీ చోరీ


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)