నా సినిమా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు: దర్శకుడు

Published on Wed, 08/30/2023 - 12:30

వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడు, ఛాయాగ్రాహకుడు తంగర్‌ బచ్చాన్‌ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం మేఘంగల్‌ కలైగిండ్రన, రిమోట్‌ మీడియా సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో దర్శకుడు భారతీరాజా ప్రధాన పాత్రలో పోషించారు. దర్శకుడు గౌతమ్‌ మీనన్‌, నటి అతిథి బాలన్‌, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతాన్ని అందించారు.

నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ ఒకటవ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా సోమవారంసాయంత్రం ఈ చిత్రం చైన్నెలోని ఒక ప్రివ్యూ థియేటర్‌లో చిత్రాన్ని మీడియాకు ప్రదర్శించారు. అనంతరం దర్శకుడు తంగర్‌ బచ్చన్‌ మాట్లాడుతూ మానవ సంబంధాలను, కుటుంబ భావోద్వేగాలను ఆవిష్కరించే ఈ చిత్రాన్ని మూడు రోజుల క్రితం తమిళనాడులోని 500 మంది సాధారణ ప్రేక్షకులను ఎంపిక చేసి మేఘంగల్‌ కలైగిండ్రన చిత్రాన్ని వారి కోసం ప్రత్యేకంగా ప్రదర్శించినట్లు చెప్పారు. మంచి చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ కచ్చితంగా ఉంటుందన్నారు.

అందుకు ఉదాహరణ తాను ఇంతకుముందు దర్శకత్వం వహించిన అళగి చిత్రమేనని పేర్కొన్నారు. చిత్ర వ్యాపారం కోసం 100 ప్రదర్శనలు ఏర్పాటు చేశామని, అయినా చిత్రాన్ని కొనుగోలు చేయడానికి బయ్యర్లు ముందుకు రాలేదని చెప్పారు. అలాంటిది అళగి చిత్రం విడుదలై ఎంత సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందేనన్నారు. కాగా చిత్ర జయాపజయాలను నిర్ణయించేది ప్రేక్షకులేనని దర్శకుడు తంగర్‌ బచ్చాన్‌ పేర్కొన్నారు. కాబట్టి మేఘంగల్‌ కలైగిండ్రన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)